జీవనస్రవంతి – 22

జీవనస్రవంతి – 22

: జరిగిన కథ :

ప్రమాదానికి గురైన పెద్దాయనను హాస్పిటల్‌లో చేర్చాడు జీవన్‌. ఆయన తన తాతయ్యే అని చెప్పి, వైద్యం ఖర్చులను తన దగ్గరున్న హెల్ప్‌లైన్‌ డబ్బు నుండి కట్టాడు. ఆయనకెవరూ లేరని, ఒంటరి వాడని, పేరు జగన్నాథం అనీ తెలుసుకున్నాడు. ఆయనకు స్పృహ వచ్చాక ‘తాతయ్యా’ అని పిలిచి, తనను మనవడుగా భావించుకోమని, ఇకనుంచి మీ అన్ని అవసరాలు నేను చూస్తానని చెప్పాడు. జగన్నాథంగారిని హాస్పిటల్‌ నుండి డిశ్చార్జి చేశాక ఆయనను ఆయన ఇంటికే తీసుకెళ్లి, తన తల్లి మీనాక్షిని ఆయన యోగక్షేమాలు చూసుకొనేలా ఒప్పించాడు. మీనాక్షి ఇచ్చిన కాఫీ తాగిన పెద్దాయన, కాఫీ బాగుందని, ఇకనుండి మీ ఇద్దరూ ఈ ఇంట్లోనే ఉండమని అన్నారు. ఆ మాటకు తల్లీ కొడుకులు ముఖముఖాలు చూసుకున్నారు.

ఇక చదవండి…

జీవన్‌ ముఖ కవళికలను బట్టి, అతనికి కూడా ఆ ఏర్పాటు ఇష్టం లేదని గ్రహించింది మీనాక్షి. ‘కష్టజీవులై, స్వయంకృషితో బ్రతికేవారికున్న స్వేచ్ఛ, స్వతంత్రర ఇతరులని ఆశ్రయించి బ్రతికే వారికి ఉరడవు’ అన్నది వాళ్లకి తెలుసు. ఎంతలో ఉండ వలసినవారు అంతలో ఉండడమే గౌరవం! ముసలాయన మాటల్లోని దైన్యం మీనాక్షిని కొంచెం ఇబ్బందిపెట్టినా, మొత్తమ్మీద తన మనసులోని మాట చెప్పేసింది.

‘బాబాయిగారూ! మన్నించాలి. ఈ ఊరు వచ్చింది లగాయతూ మేము ఆ ఇంట్లోనే ఉంటున్నాం. అది మాకు అచ్చొచ్చిన ఇల్లు. అద్దె కూడా చాలా తక్కువ. స్వంత ఇల్లులా అలవాటై పోయింది, దానిని వదులుకుని రాలేం’ అంది.

జగన్నాథంగారు మరేమీ మాటాడలేకపోయారు. కాసేపు ఊరుకుని మళ్లీ జీవన్‌తో అన్నారు, ‘నా కోసం నువ్వు ఇంత ఆలోచించావు, నన్ను నీ తాతయ్యగా భావించి సేవలు చేశావు, నీ కోసం నేనేమీ ఆలోచించ కూడదా? మీ అమ్మ వంటచేసి నాకు పెట్టి తనూ తింటుంది. ఇక మిగిలింది నువ్వు ఒక్కడివి! నువ్వేమో నాతో సహపంక్తిని కూచుని తినడం కంటే ‘చెయ్యి కాల్చుకోడమే’ మేలనుకుంటున్నావు, సబవే నంటావా?’

”నాకోసం ఆలోచనెందుకు తాతయ్యా? నేను ప్రాజ్ఞుడిని, చెయ్యి కాల్చుకోకుండా వండడం నాకు చేతనవును’ అన్నాడు జీవన్‌, పెద్దాయన్ని ఎలాగైనా ఒప్పించాలని చూశాడు.

పెద్దాయన జీవన్‌ వైపు ఒక్కక్షణం కన్నార్పకుండా చూసి, ‘బాబూ! నువ్వు నామాట కాదనవని ఆశపడ్డా. ఇంతవరకూ నేను అడక్కుండానే నువ్వు నాకు ఎంతో మేలు చేశావు. అలాగని ఇంకా ఇంకా అడగడం తప్పేనేమో! ఐనవాళ్లతో కలిసి డైనింగ్‌ టేబులు దగ్గర కూర్చుని, కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలని ఎంతో కోరికగా ఉంటుంది నాకు. కాని, ఎట్టి పరిస్థితి లోనూ అది కుదరదు కదా! మీ అమ్మ నా కోసం వండిన ప్రతివస్తువు నాతో పాటుగా నువ్వూ తిన్న నాడే నాకు పూర్తి సంతోషం. కాని నీకేమో అది నచ్చదు’ అని చెప్పేసి, మరి మాటాడకుండా, ముస లాయన మూతి ముడుచుకుని కూర్చుండిపోయారు. మందిచ్చే వేళ కావడంతో జీవన్‌ ఆయనకు టాబ్లెట్‌ ఇస్తే ఆయన దానిని తీసుకోలేదు.

‘జీవన్‌బాబూ! ఒంటరితనంతో విసిగిపోయాను నేను. నువ్వు నాకు అనుకోకుండా పరిచయమై ఎంతో సాయం చేశావు. ఈ ఒక్క సాయం కూడా చేస్తివా, నేను ఆనందంగా ఉంటాను. ఐనవాళ్లని పక్కన కూర్చోబెట్టుకుని పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలని ఉంటుంది నాకు. నీకు భోజనం పెడితే నా భాగ్యమేమీ తరిగిపోదు. నాకు బోలెడు డబ్బుంది, కాని ఏం లాభం! సుఖసంతోషాలు మాత్రం శూన్యం!’ అలా అంటూంటే ఆయన కంఠం ఒణికింది, ముఖం ఎర్రగా కందిపోయింది.

పెద్దాయనకి కోపం వచ్చిందేమోనని భయపడిన మీనాక్షి కొడుకువైపు భయం భయంగా చూసింది. చివరకు ఆయన అలకకి జీవన్‌ లొంగక తప్పలేదు.

వెంటనే ‘ఓకే తాతయ్యా! అంతా మీ ఇష్టం’ అనేశాడు. అప్పటికప్పుడు ఒక ప్లాను తయారయ్యింది.

మీనాక్షి ఇల్లు ఖాళీ చెయ్యకుండా అందులోనే ఉంటూ, ఉదయం ఏడయ్యేసరికి జగన్నాథంగారి ఇంటికివచ్చి ఆయనకు టిఫిన్‌, కాఫీ చేసి ఇచ్చి, కొడుక్కి కూడా పెట్టి, తను తిని, ఆపై ముగ్గురికీ వంట చేసేటట్లూ, టిఫిన్లు అయ్యాక జీవన్‌ తన పనిమీద వెళ్ళినా, పన్నెండయ్యేసరికి తిరిగివచ్చి తాతయ్యకు డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కంపెనీ ఇచ్చే టట్లూ, భోజనం అయ్యాక అతడు తిరిగి తన పనిమీద వెళ్లిపోయినా, మీనాక్షి పెద్దాయనను కనిపెట్టుకుని ఉండేటట్లూ, మధ్యాహ్నం కొంతసేపు విశ్రాంతి తీసుకుని, ఆపై నాలుగు గంటలకు పెద్దాయనకు చిరుతిండీ, కాఫీ ఇచ్చాక రాత్రికి వంట చేసి, కేసరోల్సులో సర్ది టేబుల్‌ మీద పెట్టి, తన రాత్రి భోజనం వెంట తీసుకుని, జీవన్‌ రాగానే ఆమె ఇంటికి వెళ్ళిపోతే, జీవన్‌ అక్కడే ఉండి, పెద్దాయనకు భోజనం వడ్డించి, తను తిని, రాత్రికి ఆయనకి తోడుగా అక్కడే పడుకుని, ఆ మరుసటి రోజు ఉదయమే ఆయనకు సాయపడి స్నానం చేయించి, మంచిబట్టలు కట్టించి, తల్లి వచ్చాక ఆయనతో పాటుగా తనూ కాఫీ టిఫిన్లు తీసుకుని మరీ తన పనిమీద వెళ్లేలా నిర్ణయించారు ముగ్గురూ. అది ముగ్గురికీ మేలైన దినచర్య ఔతురదని ముగ్గురూ ఒప్పుకున్నారు. ఈ టైమ్‌ టేబుల్‌ని ‘శుభస్య శీఘ్రం’ అని అప్పటికప్పుడే అమలులో పెట్టేశారు.

– – – – – – –

పసిబిడ్డకు గోరువెచ్చటి నీటితో తలారా స్నానం చేయించి, శుభ్రంగా తలా, ఒళ్లూ తుడిచి, పౌడరద్ది, అగరుతో నుదుట చుక్కబొట్టు, బుగ్గన దిష్టిచుక్క పెట్టి, ఉయ్యాల తొట్టెలో పడుకోబెట్టింది సుజాత. వెంటనే నిద్రపోయింది ఆ పాప. కొరచెంసేపలా ముగ్ధ మోహనంగా నిదరపోతున్న కూతుర్నే చూసుకుంటూ తొట్టి దగ్గరే నిలబడిపోయింది ఆమె. అంతలో ‘సుజాతక్కా’ అన్న పిలుపు వినిపిరచడంతో వెనక్కి తిరిగి చూసిన సుజాతకి గుమ్మంలో జీవన్‌ కని పించాడు. వెంటనే అతనిని లోనికి ఆహ్వానించింది సుజాత.

‘రా, రా! ఊరక రారు మహాత్ములు – అన్నది నానుడి! నీ రాకకు కారణం బెయ్యది సోదరా!’ అంటూ దగ్గరగా వచ్చి పలకరించింది సుజాత.

బ్యాంకులో చెక్కు మార్చి తెచ్చిన డబ్బు తీసి సుజాత చేతికి అందించాడు జీవన్‌. ‘అక్కా! కతజ్ఞుణ్ణి. సమయానికి నువ్వు డబ్బిచ్చి నన్ను ఆదుకున్నావు. లేకపోతే నేను అప్రదిష్టపాలై ఉండేవాడిని!’ అన్నాడు.

‘పోరా బడుద్ధాయ్‌! నువ్వు నన్నేం పొగడ్తలతో ముంచెత్తనక్కరలేదు. ఏమాత్రం తెలియని వ్యక్తికి నువ్వు చేసిన సాయంకంటే ఎక్కువా ఏమిటి నేను నా తమ్ముడికి చేసిన సాయం? ఆ డబ్బు తిరిగి వస్తుందో లేదో తెలియకపోయినా రిస్కు తీసుకుని, హెల్పులైన్‌ తాలూకు డబ్బు ఆ పెద్దాయన కోసం నువ్వు ఖర్చు పెట్టేశావు. అసలు విషయం చెప్పు, ఇంత తొందరగా తెచ్చేశావంటే ఈ డబ్బు నీకు ఎక్కడిది? నాకేం తొందరలేదు. నువ్వేం ఇబ్బంది పడకు. కొన్నాళ్లు పోయాక ఇవ్వవచ్చులే’ అంటూ ఆ డబ్బు జీవన్‌కి తిరిగి ఇచ్చేయబోయిరది సుజాత.

ఆ డబ్బుని అందుకోలేదు జీవన్‌. నెమ్మదిగా ఉయ్యాల దగ్గరకి వెళ్లాడు. ‘పెద్దాయనకి డబ్బుకి లోటులేదు అక్కా! ఇంటికి రాగానే నేను హాస్పిటల్లో కట్టిన డబ్బు, నయాపైసలతో సహా నాకు ఇచ్చేశారు. ఆయన ఇంట్లో అమ్మకి కూడా పనిదొరికిరది వంటమనిషిగా. ఇప్పుడు అమ్మా నేనూ చూస్తున్నాం, ఆయన సంరక్షణ. ఆయన తహసీల్దారుగా రిటైర్‌ అయ్యారుట! ప్రతినెలా పెద్ద మొత్తంలో పెన్షన్‌ వస్తుందిట! ఐతేనేం, పాపం! తాతయ్యను చూస్తే జాలేస్తోరది. కొడుకూ కోడలూ ఉద్యోగస్తులట! ముసలాయన్ని గాలికి వదిలేశారు. ఎంత డబ్బురడీ ఏమి లాభం చెప్పు, ఈ వయసులో ఆదరంగా చూసుకునేవాళ్ళు లేకపోయాక! ఇల్లు చేరగానే తనకైన మొత్తం ఖర్చు చెక్కురాసి ఇచ్చారు. దానిని మార్చి, నీ బాకీ తీర్చడం కోసం బ్యాంకు నుండి నేరుగా ఇటే వచ్చా. అట్టేపెట్టుకో అక్కా! నాకేమీ ఇబ్బంది లేదు’ అన్నాడు. ‘సరే’ అంది సుజాత.

‘అక్కా! నీకు ఎవరైనా చక్కగా వంట చేసేవాళ్లు తెలిస్తే చెప్పు. ప్రస్తుతానికి అమ్మ ఖాళీగా ఉంది కాబట్టి తాతయ్యకు వండిపెడుతోంది. రేపు యాజులు తాతయ్యగారు వచ్చాక కుదరదు కదా! ఈ లోగా ఎవరైనా కమ్మగా వండిపెట్టేవాళ్లు దొరికితే బాగుంటుంది’ అన్నాడు జీవన్‌.

‘భేష్‌! హెల్పులైన్‌ జిందా బాద్‌!’ అంటూ జీవన్‌ వీపు తట్టింది సుజాత. ‘పెద్దాయనకి నువ్వు చేస్తున్న ఈ సహాయం మీ హెల్పులైన్‌ అనే మణి కిరీటానికి కలికితురాయి లాంటిది! అని మెచ్చుకుంది సుజాత.

‘థాంక్స్‌ అక్కా ! హెల్ప్‌లైన్‌ని చక్కగా అర్థం చేసుకున్నావ్‌’ అంటూ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు జీవన్‌.

– – – – – – –

జగన్నాథంగారు జీవన్‌ చేసిన ఏర్పాటుకి చాలా సంతోషించారు. ఆ పద్ధతివల్ల పెద్దాయన ఎప్పుడూ ఒంటరిగా ఉండడం జరగదు. తల్లీ కొడుకుల్లో ఎవరో ఒకరు ఎల్లవేళలా ఆయనకు తోడుగా ఉంటారు. మొదటి నుండీ, మీనాక్షిని ఆయన ‘అమ్మాయీ!’ అనీ, జీవన్ని ‘మనుమడా!’ అనీ ఆత్మీయంగా పిలవ సాగారు. మొదట్లో మీనాక్షి, మగవాళ్లిద్దరికీ వడ్డించి తరవాత తను తిరటానని చెప్పింది. కాని, దానికి జగన్నాథం గారు ఎంతమాత్రం ఒప్పుకోకపోడంతో, మీనాక్షి ఒకసారి అందరికీ వడ్డించి తనుకూడా వాళ్లతో కూర్చుని తినడం మొదలుపెట్టింది. రెండవ సారి పదార్థాలు కావలసి వస్తే ఎవరికి వారు వడ్డించుకుని తింటున్నారు. మొత్తంమీద ముగ్గురూ ఆ కబురూ ఈ కబురూ చెప్పు కుంటూ సరదాగా భోజనం చేస్తున్నారు. ముగ్గురూ కూడా ఆత్మీయతల కోసం ఎదురు చూస్తున్నవాళ్లే కనక ఈ ఏర్పాటు వాళ్లకు ఎంతో ఆనందాన్నిచ్చింది. మీనాక్షీ జీవన్‌ల సంరక్షణలో తాతయ్య జగన్నాథంగారు చక్కగా కోలుకుంటు న్నారు.

మాటల సందర్భంలో ఒక రోజున పెద్దాయనకు ‘హెల్పులైన్‌’ గురించి చెప్పాడు జీవన్‌. వెంటనే జగన్నాథం గారు తనుకూడా హెల్పులైన్లో మెంబర్షిప్‌ తీసుకురటానంటూ ఉబలాటపడ్డారు. ఇంట్లోకి కావల సిన సరుకులన్నీ తెచ్చి ఇచ్చి నీకు రావలసిన కమీషన్‌ నువ్వు తీసుకోమన్నారు జీవన్ని. జీవన్‌ నవ్వాడు. ‘మనింటికి కావలసిన వస్తువులు తెచ్చినందుకు నేను కమిషన్‌ తీసుకోడం మొదలెడితే తాతయ్యా, ఇక మనం తాతా మనుమల మెలాగౌతాం? ఇది మన ఇల్లు ఎలాగౌతురది, నువ్వే చెప్పు తాతయ్యా !’ అన్నాడు చిరునవ్వుతో.

వెంటనే జగన్నాథంగారు బుంగమూతి పెట్టి, గారాలుపోతూ, ‘మరలాగైతే నువ్వీ తాతయ్య దగ్గర నెలనెలా పోకెట్‌ మనీ గురజుకోవాలి. నేను మర్చిపోతే నువ్వు మారాం చెయ్యాలి. అలాగైతే సరే..’ అన్నారు. ఆయన మాటాడిన తీరు తల్లీ కొడుకులకి నవ్వు తెప్పించింది.

తాతయ్య అవసరం లేదని చెప్పినా వినకుండా, పట్టుపట్టి జీవన్‌ ఆయన కొడుక్కి, జరిగిన యాక్సి డెంట్‌ను గురించి ఆయనచేతే ఉత్తరం రాయించి, దానికి అడ్రస్‌ రాసి పోస్టు చేశాడు. వారం తిరిగేసరికి ముక్తసరిగా కొడుకు దగ్గరనురడి జవాబు వచ్చింది..

‘నాన్నకి నమస్కారాలు. మీకు యాక్సిడెంట్‌ అయ్యిందని తెలిసి నేనూ, రజనీ చాలా బాధపడ్దాం. ఇప్పుడు కులాసాగా ఉన్నారని తలుస్తాను. వద్దామంటే సెలవు దొరకలేదు. ఉంటా. రఘురాం’.

పెద్ద కాగితం మీద చిన్న ఉత్తరం! మరి రెండు మాటలు రాసేందుకు టైం కూడా దొరకలేదా? తన కుటుంబ యోగ క్షేమాలను గురించి ఒక్క ముక్క లేదు సరికదా, యాక్సిడెంటైనప్పుడు తనని ఎవరు ఆదుకున్నారన్నదానిని గురించి కూడా ఒక్కమాట రాయలేదు. అంటీ అంటనట్లుగా, ముట్టీ ముట్ట నట్లుగా ఉన్న కొడుకు ఉత్తరం పెద్దాయనకు చాలా కోపం తెప్పించింది.

‘మనసు కోరితే మార్గర దొరక్కపోదు. ఇది తీరుబడి లేక కాదు-ముసలాడు ఎలాపోతే మనకేమిటన్న నిర్లక్ష్యం. నా పుణ్యం బాగుండి, సమయానికి నువ్వు వచ్చి నన్ను రక్షిరచావు కనక బ్రతికి ఉన్నా. లేకపోతే రోడ్డుమీద బస్సు కింద పడి, ముక్కలుచెక్కలై దిక్కుమాలిన చావు చచ్చేవాడిని!’ జీవన్‌తో పదేపదే తన కొడుకుని గురించి చెప్పి ఆ రోజంతా బాధపడ్డారు ఆయన.

‘ఒక్కగానొక్క కొడుకని ప్రాణాలన్నీ వాడిమీదే పెట్టుకుని పెంచి పెద్దచేశాం. కోరిన చదువు చెప్పించి, పెళ్లీపేరంటం చేసి, ఉద్యోగపు ఊరికి అంపకం పెట్టాం. వాడికి ఏ లోటూ రాకుండా కళ్లల్లో పెట్టుకుని చూశాం. అలాంటప్పుడు కాలూ, చెయ్యీ ఉడిగిన తల్లితండ్రులపై కాస్తంత కనికరమైనా ఉండొద్దా? నాకు ఇద్దరు మనుమలున్నారు. కాని, వాళ్ల ముద్దుముచ్చట్లు చూసుకునే భాగ్యం నాకు లేదు. నా భార్య పోయేముందు ఒక్కసారి కొడుకుని, వాడి కుటురబాన్ని చూడాలని ఆరాటపడింది. కాని ఎంత బతిమిలాడినా, రేపు మాపు అంటూ గడిపేశాడేగాని, రాలేదు. చివరకి కొడుకుపై బెంగతోనే ఆమె చని పోయింది. తప్పనిసరిగా అప్పుడు వచ్చాడు కర్మలు చెయ్యడానికి! అదేదో నాల్గురోజులకు ముందే రావచ్చుకదా! మళ్లీ, నా కర్మానికి నన్నిక్కడే ఒంటరిగా వదిలేసి, వచ్చిన బంధువులతో పాటుగా తనూ, తన కుటుంబాన్ని తీసుకుని వెళ్లిపోయాడు!’ అంటూ వాపోయాడు పెద్దాయన. వాళ్ల మనుమలు చిన్నగా ఉన్నప్పుటి ఆల్బం మీనాక్షికి చూపించి ‘అమ్మా మీనాక్షీ! నేను పోయేలోగా వాళ్లు ఒక్కసారి వచ్చి కనిపిస్తారంటావా?’ అంటూ తన బాధను వెళ్లబోసు కున్నాడు ఆయన.

జగన్నాథంగారి వద్ధ మిత్రులు ముగ్గురు ఆయనతో గడిపి పోడానికి అప్పుడప్పుడూ వస్తూం టారు. మీనాక్షి వాళ్లని కూర్చోబెట్టి, కాఫీయో, మజ్జిగో, మంచినీళ్లో ఇచ్చి, కుశలప్రశ్నలడిగి గౌరవిరచేది. వాళ్లకి ఏ వస్తువు కావాలన్నా జీవన్‌ తెచ్చిచ్చేవాడు. మాటలో మంచితనం, పరోపకారబుద్ధీ గల ఆ తల్లీకొడుకులు చాలా తొందరగా వాళ్ల మనసును చూరగొన్నారు. అంతేకాదు, జగన్నాథంగారు మిత్రులతో, కూతురులేని తనకు దేవుడు వరంగా ఇచ్చిన కూతురు మీనాక్షని చెప్పి మురిసేవారు.

– – – – – – –

చూస్తూండగా ఒక నెల గడిచిపోయింది. జగన్నాథంగారు చెక్కు రాసిచ్చి జీవన్‌ చేత డబ్బు తెప్పించారు. మీనాక్షికి నెల జీతంగా నాలుగువేలు తీసి ఇచ్చారు ఆయన. మీనాక్షి ఆ డబ్బు తీసుకుని కొంగున కట్టుకుంది. మనుమడికి పోకెట్‌ మనీగా ఒక వెయ్యి రూపాయిలు జేబులో పెట్టబోయారు. కాని జీవన్‌ తీసుకోడానికి ఒప్పుకోలేదు. అలాగని ముసలాయన ఊరుకోలేదు, జీవన్‌కి పుట్టినరోజు కానుకగా ఒక మంచి రిస్టు వాచీ, ఒక ర్యాలీ సైకిల్‌ కొని బహుమతిగా ఇచ్చారు.

చేతిలో సైకిల్‌ ఉండడంతో హెల్పులైన్‌ పనులు మరింత వేగంగా జరిగిపోతున్నాయి.

ఒకరోజు జీవన్‌ రాకకోసం గుమ్మంలో కనిపెట్టుకుని ఉరది మీనాక్షి. ఆమె ముఖం ఆదుర్దాతో నిరడి ఉరది. తల్లి ముఖం చూసి భయపడ్డ జీవన్‌ వెంటనే హాల్లోని పడకకుర్చీవైపు చూశాడు. అక్కడ తాతయ్య కనిపించకపోవడంతో కంగారుపడ్డాడు.

‘తాతయ్యయేరీ ? ఎక్కడున్నారు’ అని అడిగాడు తల్లిని ఆత్రపడుతూ.

‘ఉష్‌! గట్టిగా మాటాడకు. తాతయ్య ఆయన గదిలో నిద్రపోతున్నారు. పొద్దున్న నువ్వెళ్లాక ఆయన బయటికి వెళ్లి వచ్చారు. ఇంటికి రాగానే పడుకున్నారు, ఇంకా లేవలేదు’.

‘హమ్మయ్య! తాతయ్య బాగున్నారుకదా! నీ ముఖం చూస్తే ఆయనకు ఏమైనా అయ్యిందేమోనని నాకు చాలా భయమేసింది. అలా ఉన్నా వెందుకమ్మా?’

‘తాతయ్య బాగున్నారు. కాని, ఆయన వేలికి ఉండాల్సిన ఉంగరం కనిపించలేదు, ఎక్కడో పడిపోయింది కాబోలు’.

‘తాతయ్య బాగున్నారు, అదే పదివేలు. ఉంగరం కూడా ఇంట్లోనే ఎక్కడో పడిపోయి ఉరటుంది. దొరుకుతురదిలే, వెతుకుదాం’ అన్నాడు జీవన్‌ ధీమాగా.

‘తాతయ్య గది తప్ప తక్కిన ఇల్లంతా వెతికాను. ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడూ లేనిది తాతయ్య ఈవేళ బయట తిరిగి వచ్చారు. అందుకే నాకు భయంగా ఉంది. పక్క వీధి మిత్రుడైన పార్ధసారథి గారికి ఒంట్లో బాగాలేదంటే వెళ్లి చూసొచ్చారు. ఉంగరం వీధిలోనే కనుక పడిపోయి ఉంటే, ఈ సరికి ఎవరికో దొరికే ఉంటుంది’.

అంతలో జగన్నాథంగారు నిద్రలేచి, ‘అమ్మాయ్‌! జీవన్‌ వచ్చాడా?’ అని కేకపెట్టి అడిగారు.

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *