గుంటుపల్లి గుహలు

గుంటుపల్లి గుహలు

మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలకు, నాగరికతకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తిరపు ఉంది. ఈ నేలలో కొలువుదీరిన రాళ్లలో సైతం మన చరిత్ర స్పష్టంగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లి ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

ప్రాచీన కాలరలో దట్టమైన అడవిలో కొలువు దీరిన అద్భుతమైన నగరం గుంటుపల్లి. ఆ రోజుల్లో ఇక్కడికి చేరుకోవాలంటే వందకు పైగా మెట్లు ఎక్కాల్సి వచ్చేది. ఎటు చూసినా కొండలు, పెద్ద పెద్ద సున్నపు రాళ్లతో ఈ ప్రాంతమంతా సుందరంగా ఉండేది. అయితే కొంతమంది ఆ సున్నపు రాళ్లను తొలిచి అక్కడ ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపు ఇరవై కొండల మీద నేడు మనకు ఇళ్లు మాత్రమే కనిపిస్తాయి. వీటిని ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? ఆ వివరాలు తెలుసుకుందాం !

ఇక్కడి గుహలన్నీ ఒకనాటి బౌద్ధారామాలు. వీటిని నిర్మించి దాదాపు రెరడు వేల సంవత్సరాలైంది. పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలంలో గుంటుపల్లి బౌద్ధ గుహలు కొలువు దీరాయి. వీటికి ఆంధ్ర అజంతా గుహలని కూడా పేరుంది. అయితే అజంతా గుహల కంటే ముందే వీటిని నిర్మించారని చారిత్రక పరిశోధనలు చెబుతు న్నాయి. క్రీ.పూ. 3వ శతాబ్ధి నాటికే గుంటుపల్లి ప్రముఖ బౌద్ధారామంగా వన్నెకెక్కింది. అశోకుని కాలంలో ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి బౌద్ధ భిక్షువులు వచ్చేవారని శిలాశాసనాలు తెలుపు తున్నాయి. అప్పట్లో ఈ నగరం మహానాగ పర్వతంగా పేరుగాంచింది.

ఆ రోజుల్లో భిక్షువులు ఇక్కడ నివసించేందుకు అనువుగా కొండలను తొలిచి ఇళ్లు నిర్మించుకున్నారు. కొన్ని చోట్ల ఐదు గదుల ఇళ్లను కూడా నిర్మించుకున్నారు. ఆ ఇళ్లకు ముందుభాగంలో వరండా, కూర్చోడానికి ఎత్తైన అరుగు, మధ్యలో దాదాపు 10 అడుగుల ఎత్తైన ద్వారం, ద్వారానికి రెండు వైపులా కిటికీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ద్వారాలను ఆర్చీలతో అందంగా తీర్చిదిద్దారు. కొండలమీద నుండి జారే నీరు ఆ గదులలోనికి

ఎలా వెళ్లాలి ?

రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ ప్రాంతాల నుంచి ఏలూరుకు, ద్వారకా తిరుమలకు వెళ్లడానికి బస్సు, రైలు, సౌకర్యాలున్నాయి. అక్కడి నుంచి ప్రైవేట్‌ వాహనాల్లో గాని, బస్సుల్లో గాని గుంటుపల్లి చేరుకోవచ్చు.

– డా|| మంతెన సూర్యనారాయణ రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *