కన్యాకుమారికి ఘన నివాళి

కన్యాకుమారికి ఘన నివాళి

నర్సరావుపేట: పన్నెండేళ్ల పాటు రాష్ట్ర సేవికాసమితి ఆంధ్రప్రాంత సహకార్యవాహికగా సేవలు అందించిన కుమారి టి.కన్యాకుమారి మరణం సంస్థకు తీరని లోటని వక్తలు శ్రద్ధాంజలి ఘటించారు. నర్సరావుపేటలో మార్చి 29న కన్యాకుమారి సంస్మరణ సభ జరిగింది. రాష్ట్ర సేవికాసమితి ప్రముఖ కార్యవాహిక అన్నదానం సీతాగాయత్రి మాట్లాడుతూ కన్యాకుమారి మంచి వ్యక్తిత్వం కలిగిన సేవిక అని, తన సమస్యలను ఏనాడు వ్యక్తం చేసేవారు కాదనీ, కానీ ఎదుటివారి సమస్యలను తీర్చడానికి తన వంతు సాయం చేయడానికి మాత్రం ముందుండేవారనీ అన్నారు. రాష్ట్ర సేవికాసమితి ఆంధ్ర ప్రాంత సహకార్యవాహిక, నర్సరావుపేటకు చెందిన టి.కన్యాకుమారి మార్చి 25న తుదిశ్వాస విడిచారు. 1988లో ప్రచారికగా వెళ్లి పన్నెండేళ్లు ఆ బాధ్యతలో ఉన్నారు. ఆకెళ్ల సీతాలక్ష్మి దగ్గర ఐదేళ్లు శారీరక్‌, వ్యవస్థలలో ప్రావీణ్యం సంపాదించారు. అనేక శిక్షావర్గలలో శిక్షక్‌గా పనిచేశారు. నర్సరావుపేటలో శాఖల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ప్రాంత సహకార్యవాహిక బాధ్యత కూడా స్వీకరించారు. ప్రాంత సంఘచాలిక డాక్టర్‌ సోమేశ్వరి, ప్రాంత బౌద్దిక్‌ ప్రముఖ్‌ డాక్టర్‌ రాధాబాయి, సేవికలు నీరజ, కన్య, నర్సరావుపేట జిల్లా సంఘచాలక్‌ రామకృష్ణ, సీతారామయ్య తదితరులు కన్యాకుమారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు 70మంది అభిమానులు కార్యక్రమంలో పాల్గొని పుష్పాంజలి సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *