99 మంది హిందువుల ఊచకోత

99 మంది హిందువుల ఊచకోత

 

       – రోహింగ్యా ఉగ్రవాదుల మారణకాండ

– 53 మంది పిల్లలను కొట్టి నరికి చంపారు

– ఆమ్నెస్టీ నివేదిక

మయన్‌మార్‌లో రోహింగ్యా ఉగ్రవాదుల అరాచకాలకు అడ్డూ ఆదుపు లేకుండా పోతోంది. 2017 ఆగస్టులో వారు 99 మంది హిందువులను దారుణంగా చంపేశారని, మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఓ నివేదికలో వెల్లడించింది. మయన్‌మార్‌లోని రాఖైన్‌ ప్రాంతంలో అనేక సమాధులు బయటపడ్డాయని, సామూహికంగా ఖననాలు జరిపినట్లు ఆనవాళ్లున్నా యని, ఆరకాన్‌ రోహింగ్వా సాల్వేషన్‌ ఆర్నీ (ఎఆర్‌ఎస్‌ఎ) ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఆమ్నెస్టీ అందులో పేర్కొంది. దేశంలో తిరుగుబాటు చేసి అనేక పోలీస్‌ పోస్టులపై దాడులు జరిపిన రోజునే అంటే 2017 ఆగస్టు 25 నాడే ఈ మారణకాండ చోటు చేసుకుందని, హిందూ మైనారిటీలను అసలు లేకుండా తరిమెయ్యాలన్నది రోహింగ్యాల కుట్ర అనీ వివరించింది.

మౌంగ్‌డా ప్రాంతంలోని ఖా మౌంగ్‌ సేక్‌ అనే గ్రామంలో 58 మంది పిల్లలను ఒక సాయుధ బందం ఉరేసి చంపేసిందని, అయితే ఈ సాయుధులు ఎవరు అనేది తేలాల్సి ఉందని కూడా ఆమ్నెస్టీ వెల్లడించింది. ‘పిల్లల, మహిళల కళ్లకు గంతలు కట్టారు. వారిని ఊరవతలకు తీసికెళ్లారు. ఆ సాయుధులంతా మామూలు దుస్తుల్లోనే ఉన్నారు. వాళ్ల వైపు చూడొద్దని మాకు చెప్పారు. వారి చేతిలో కత్తులు, ఇనుప రాడ్లు ఉన్నాయి. వాటితో కొట్టి నరికి చంపేశారు. ఆ పిల్లల ఆర్తనాదాలు ఇప్పటికీ మా చెవుల్లో మార్మోగుతున్నాయి. తలుచుకుంటుంటే భయం వేస్తోంది’ అని రాజకుమారి అనే ఓ ఇరవయ్యేళ్ల యువతి చెప్పినట్లు ఆమ్నెస్టీ నివేదిక వివరించింది.

పక్కనే ఉన్న మరో గ్రామంలో దాదాపు 46 మంది పురుషులు ఒకే రోజున అదశ్యమయ్యారు. వీరందరిని కూడా ఆర్సా ఉగ్రవాదులు చంపేసి ఉంటారని భావిస్తున్నట్లు గ్రామస్తులు చెప్పారు. రాఖైన్‌ ప్రాంతం ముస్లింలకు, హిందువులకు నెలవు. వారందరినీ ఏరేసే పనిని రోహింగ్యాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమ్నెస్టీ నివేదిక బయటపెట్టడం చెప్పుకోదగ్గ విషయం.

మయన్‌మార్‌లో రోహింగ్యాల అరాచకాల గురించి భారత్‌లోని జాతీయ వాదులు ఎప్పుడో చెప్పిన అంశాన్ని ఆమ్నెస్టీ ఇన్నాళ్ళకు చెప్పటం సంతోషకరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *