వాకాటి ప్రమీలా దేవి ఇక లేరు

వాకాటి ప్రమీలా దేవి ఇక లేరు

అక్షరాలతో ఆటలాడుకుంటూనే అత్యంత లోతైన అర్థాలను స్ఫురింపచేసే అద్భుత కథాకథన చక్రవర్తి వాకాటి పాండురంగారావు ధర్మపత్ని వాకాటి ప్రమీలా దేవి ఇక లేరు. మే 18న హైదరాబాద్‌లో ఆమె స్వర్గస్థులయ్యారు. కాళహస్తీశ్వర మాహత్మ్యం వంటి కావ్యాన్ని వ్రాసిన మహాకవి ధూర్జటి ఆమె పూర్వజులు. ఆమె తండ్రి డి.వెంకటేశ్వర్లు నెల్లూర్‌ వి ఆర్‌ కాలేజీలో గణిత అధ్యాపకులు.

ఆమె మాతామహులు సీ.రామయ్య. ఆయన చేయి తిరిగిన రచయిత. ఆధునిక భారత ఆధ్యాత్మిక దీప్తి వంటి దివ్యజ్ఞాన సమాజానికి పేరెన్నికగన్న నాయకులు. ఆ కుటుంబ సంస్కారాన్ని, సాహిత్య సౌరభాన్ని, సంస్కృతీ సంపదను తనలో ఇముడ్చుకుని, వాకాటి పాండురంగారావు సాహిత్య యజ్ఞంలో తనదైన పాత్రను పోషించారు ప్రమీలా దేవి. తన ప్రేమాదరాలు, ఆత్మీయ స్పర్శతో తన పిల్లలు, వారి పిల్లలనే కాదు సమాజంలోని ఎంతో మందికి మాతృ సుధలను అందించారు. వారి జీవితాలను సరైన మలుపు తిప్పారు.

ఆమె పెదవులపై అనునిత్యం నర్తించే స్తోత్రం ”అన్నపూర్ణే విశాలాక్షీ.” సుప్రసిద్ధ సంగీత విద్వాం సులు నేదునూరి కృష్ణమూర్తి తన సంగీత కచేరీ కార్యక్రమాలలో వాకాటి దంపతులను చూడగానే అందుకునే ఆత్మీయ గీతం ”అన్నపూర్ణే విశాలాక్షీ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *