తిరువనంతపురంలో ఎబివిపి మార్చ్‌

తిరువనంతపురంలో ఎబివిపి మార్చ్‌

కేరళలో సి.పి.ఎం. దుర్మార్గాలకు వ్యతిరేకంగా తిరువనంతపురంలో 11 నవంబర్‌ 2017 నాడు ఎ.బి.వి.పి. (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌) ఛలో కేరళ మార్చ్‌ నిర్వహించింది. దేశవ్యాప్తంగా దాదాపు లక్షమంది విద్యార్థులు ఈ మార్చ్‌ (నడక) లో పాల్గొన్నారు.

సి.పి.ఎం క్రూర వైఖరికి నిరసనగా, వామపక్ష పాలన ఉన్న కేరళలో సంస్థాగత కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ కోసం ఈ ర్యాలీని నిర్వహించారు.

ఈ సంవత్సరంలో దాదాపు 300 లకు పైగా ఎ.బి.వి.పి. కార్యకర్తలపై మార్క్సిస్టులు దాడి చేశారు. కేరళలో సి.పి.ఎం. పాల్పడుతున్న ఎర్ర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎ.బి.వి.పి దేశవ్యాప్త ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ మహా ర్యాలీ మ్యూజియం జంక్షన్‌ నుండి ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. ర్యాలీలో బాలికలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీ పాలయం విగ్రహం గుండా వుత్తిర కందం మైదానానికి చేరుకుంది. ఆ తరువాత మధ్యాహ్నాం 1.00 గ|| లకు బహిరంగ సభ ప్రారంభమైంది.

ఎ.బి.వి.పి. జాతీయ అధ్యక్షుడు నగేశ్‌ ఠాకుర్‌, ప్రధాన కార్యదర్శి వినయ్‌ బిద్రె, మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీహరి బోరికర్‌, మార్క్సిస్టుల దాడిలో తన రెండు కాళ్ళు పోగొట్టుకున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకులు సదానందన్‌ మాస్టర్‌, త్రిసూర్‌, మార్క్సిస్టు గూండాల దాడిలో తన కళ్ళను కోల్పోయిన ఎ.బి.వి.పి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెఎస్‌ అనూప్‌, ఢిల్లి విశ్వవిద్యాలయం, శ్రీ కృష్ణ కళాశాల యూనియన్‌ కార్యదర్శి కిశోర్‌ బర్మన్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం ఎ.బి.వి.పి. నాయకుడు నిధిత్రిపాఠి, ఎ.బి.వి.పి జాతీయ కార్యదర్శి బనితీష్‌, కేరళ రాష్ట్ర కార్యదర్శి పి.శ్యాం రాజ్‌లు ర్యాలీలో ప్రసంగించారు.

ర్యాలీకి ముందు అఖిల భారతీమ విద్యార్థి పరిషత్‌ కార్యకర్తలు పాలయం మార్టైర్స్‌ కాలం నుండి గాంధి పార్క్‌ వరకు సామూహిక పరుగు నిర్వహించారు. ఎ.బి.వి.పి. జాతీయ అధ్యక్షుడు నగేశ్‌ ఠాకూర్‌, పార్లమెంట్‌ సభ్యులు సురేశ్‌గోపి ఈ సామూహిక పరుగును ప్రారంభించారు.

ఈ ర్యాలీలో పాల్గొనడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి దాదాపు లక్ష మంది విద్యార్థులు వచ్చారు. నగరంలోని వివిధ కళ్యాణ మండపాలు, గృహాలలో బాలికలకు వసతి కల్పించారు. నగరంలో, చుట్టు పక్కల గల 40 వేర్వేరు ప్రాంతాల్లో బాలురకు వసతిని ఏర్పాటు చేశారు. ర్యాలీ అనంతరం పుత్తరికందం మైదానం వద్ద విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని సంఘ కుటుంబాల మాతృమూర్తులు చపాతి, ఇతర వంటకాలు తయారు చేసి తీసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *