అందమైన మెడ కోసం !

అందమైన మెడ కోసం !

ఎంత వయసు వచ్చినా సరే అందంగా కనపడాలనే ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రభావం ముఖం మీద, ఇతర శరీర భాగాలపై పడుతుంది.

మరి ఏ వయసులోనైనా అందంగా కనిపించా లంటే సౌందర్య సంరక్షణలో భాగంగా కొన్ని అదనపు జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా వయసు పెరగడం వల్ల మెడ వద్ద చర్మం వదులుగా మారి ముడతలు పడడం, సన్నని గీతల్లా కనిపించడం, ఎక్కువగా సూర్యరశ్మి ప్రభావానికి గురికావడం, శరీరంలో టాక్సిన్స్‌ ఎక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల మెడ దగ్గర చర్మం సాగుతుంది. అయితే ఎప్పటి కప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వద్ధాప్య ఛాయలను దరి చేరనీయకుండా నవయవ్వ నంగా కనిపించవచ్చు.

మరి నవయవ్వన చర్మం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరూ చదివేసేయండి..!

మర్దన..

మదువుగా మర్దన చేయడం వల్ల కూడా వదులుగా ఉన్న చర్మం బిగుతుగా మారుతుంది. ముందుగా గోరువెచ్చని నీళ్లతో ముఖం, మెడ భాగాలను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఆలీవ్‌ ఆయిల్‌ను తీసుకొని చేతి మునివేళ్ల సహాయంతో మెడవద్ద రెండు నిమిషాలు మదువుగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల మెడ భాగంలో ఉండే చర్మకణాలకు సహజ మైన తేమ అందడమే కాకుండా వదులైన చర్మం మళ్లీ బిగుతుగా మారుతుంది. వారానికి కనీసం రెండు సార్లయినా ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది.

వ్యాయామం..

మెడ భాగానికి సంబంధించిన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం ద్వారా అక్కడ ఉన్న చర్మకణాలను పునరుత్తేజితం చేయవచ్చు. దీనివల్ల కొల్లాజైన్‌ ఉత్పత్తి అయి ఆ భాగంలో చర్మం బిగుతుగా మారుతుంది. దీనివల్ల చర్మం ముడుతలు తగ్గుముఖం పట్టడమే కాదు వదులుగా మారిన చర్మం కూడా తిరిగి పటుత్వాన్ని సంతరించుకుంటుంది. అదే విధంగా మెడ సంబంధమైన సమస్యలు కూడా తగ్గుతాయి. మెడ వ్యాయామాన్ని రోజు కనీసం పదిహేను నిమిషాలు చేయాలి. అయితే మెడకి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహా తీసుకుని చేయాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అధిక సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్తపడడం, మదువుగా మర్దన చేసుకోవడం, వంటి జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వదులుగా మారిన చర్మం తిరిగి బిగుతుగా మారేందుకు కొన్ని మాస్క్‌లను కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. మరి ఇంట్లో దొరికే వాటితో ఏవిధంగా మాస్క్‌లు తయారు చేసుకో వచ్చంటే….!

బ్యూటీమాస్క్‌లు

తెల్లసొన, తేనెతో..

కోడిగుడ్డులోని తెల్లసొనలో రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ వేసుకోవడం ద్వారా వదులుగా మారిన చర్మం అతి తక్కువ సమయంలోనే తిరిగి బిగుతుగా మారుతుంది.

పెరుగు, నిమ్మరసంతో..

రెండు చెంచాల పెరుగు తీసుకొని దానిలో రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ వద్ద ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. తర్వాత చేతి వేళ్ల సహాయంతో పది నిమిషాలపాటు మదువుగా మర్దన చేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు క్రమం తప్పకుండా చేస్తే చర్మం తిరిగి బిగుతుగా మారడమే కాదు.. ప్రకాశ వంతంగానూ తయారవుతుంది.

కలబందతో..

కలబంద గుజ్జు, తేనె… ఈ రెండూ ఒక చెంచా చొప్పున ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ వద్ద ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకో వాలి. ఇలా చేస్తే చాలా తక్కువ సమయంలో మెడపై ఉన్న ముడతలు తగ్గుతాయి. కేవలం ప్యాక్స్‌ మాత్రమే కాదు.. పసుపు, తేనె, అరటిపండు, బొప్పాయి, కీరదోస, ఆలుగడ్డ.. మొదలైనవి కూడా మెడభాగంలో రాసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది.

పోషకాహారం అతిముఖ్యం

అందంగా కనిపించాలంటే కేవలం రకరకాల మాస్క్‌లు వేసుకోవడం మాత్రమే కాదు, మనం తీసుకునే ఆహారం కూడా అందుకు తోడ్పడే విధంగా ఉండాలి. పోషకాహారం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా వస్తుంది. దీనికి రోజూ ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు.. మొదలైన పోషకాలన్నీ అందేలా సమతులాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే తాజా పండ్లు, కూర గాయలు మన మెనూలో భాగం చేసుకోవాలి. అదేవిధంగా అనవసరంగా వేసుకునే ట్యాబ్లెట్లు కూడా ఆరోగ్యం, అందంపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అవసరమైతే తప్ప మందులు వాడకూడదు. అలాగే బరువు తగ్గాలను కునేవారు ఒకేసారి ఎక్కువగా బరువు తగ్గడం కాకుండా క్రమంగా కొద్దికొద్దిగా తగ్గడం మంచిది. ఇవన్నీ చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపించేవే కాబట్టి వీటి విషయం లో అశ్రద్ధ చేయడం అస్సలు మంచిది కాదు.

– విజేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *