వారఫలాలు 11-17 ఫిబ్రవరి 2019

ఈ వారం అన్ని రాశులవారికి అదృష్ట సంఖ్యలు : 1,3,4,5,7,9

 మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

విజయావకాశాలు అధికం. మనోధైర్యం పెరుగుతుంది. సమస్యలున్నా పరిష్కారమవుతాయి. గృహమార్పులు, నిర్మాణావకాశాలున్నాయి. శుభకార్యాదులకు అవకాశం. సంతాన సౌఖ్యం. అధికారుల ఆదరణ ఉంటుంది. పెద్దల్ని కలుసుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. పెట్టుబడులు మిశ్రమం. ఆదిత్య స్మరణం లాభప్రదం.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

వృత్తి, వ్యవహార, వ్యాపార రంగాల వారికి అనుకూల సమయం. ఇతరులతో మాటలందు లౌక్యం మేలు. ప్రయాణాలందు అప్రమత్తంగా ఉండాలి. అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. దూరపు బంధువుల రాక. వస్తు, వస్త్ర ప్రాప్తి. రుణ సమస్యలు పరిష్కారం. అనవసర విషయాలలో అప్రమత్తత అవసరం. పార్వతీపరమేశ్వర ధ్యానం శుభప్రదం.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

ఘ్ర విజయం. కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. సహాయ, సహకారాలున్నాయి. వ్యవహారాల్లో ముందస్తు ప్రణాళికలు మేలు. శ్రమానుకూల ఫలాలను అందుకుంటారు. పెట్టుబడులున్నాయి. ఆర్థిక తృప్తి ఉంటుంది. స్థిరాస్తి వృద్ధి. సంతోష వార్తలు వింటారు. ఆలోచించి ముందుకువెళ్లాలి. విష్ణు స్మరణం ఆనందప్రదం.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

శుభ సమయం. అదృష్ట యోగముంది. సానుకూల ఫలాలను అందుకుంటారు. పట్టుదలగా పనులు చేస్తే సత్ఫలితాలు పొందుతారు. గృహ, స్థల యోగాలున్నాయి. ప్రశాంత వాతావరణానికై మీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంగళవారం అనారోగ్య సూచనలు. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగాల విస్తరణ. వృత్తి మెలకువలు పాటించండి. దక్షిణామూర్తి స్మరణం యోగదాయకం.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

ఆర్థిక ప్రగతి, జయవృద్ధి. అన్నింటా మంచి సమయం. పదవీ లాభ ప్రాప్తి. కుటుంబ సభ్యుల సాయముంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శనివారం దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ధైర్యంగా ముందుకెళ్లండి. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి. శుభ కార్యాలున్నాయి. శివారాధన శ్రేయస్కరం.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

ధన లాభముంది. ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధికారుల అండదండలున్నాయి. ఒక సంఘటన ఇబ్బందికరం. గౌరవ పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలందు వృద్ధి. అనుకోని ప్రయాణాలున్నాయి. గతంలో వాయిదా పడ్డ పనులు పూర్తి. శుభకార్యాలు వృద్ధి. అనుకూలతలున్నాయి. లక్ష్మీస్తోత్రం శుభప్రదం.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

అభీష్టాలు నెరవేరుతాయి. ఆశయాలు సిద్ధిస్తాయి. మనోబలం ఆలోచనలను పెంచుతుంది. అందుకు అనుగుణంగా పని చేయండి. పట్టుదల ముఖ్యం. కుటుంబ సభ్యుల్ని కలుసుకుంటారు. వ్యాపార, వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలందు పాల్గొంటారు. ఇష్టదేవతా స్మరణం అభీష్టప్రదం.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

విజయ ప్రాప్తి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలందు జాగ్రత్త అవశ్యం. ఇతరుల మాటలు నమ్మకండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలందు అనుకూలమైన మార్పులు. పెట్టుబడులందు వృద్ధి. అన్నింటా లౌక్యం ప్రదర్శించండి. తొందరపాటు పనికిరాదు. విష్ణు సహస్ర నామాలు జపించండి.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

ధన, ధాన్య లాభాలు అందుకుంటారు. కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఖర్చులకు అడ్డుకట్ట వేయాల్సి వస్తుంది. మిత్ర బలం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. తొందరలు వద్దు. మీ ప్రమేయంతో శుభకార్య ప్రయత్నాలుంటాయి. నవగ్రహ స్తోత్రం బలాన్నిస్తుంది.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

ఉద్యోగ బదిలీలున్నాయి. వృత్తి, వ్యాపార, వ్యవహారాలలో లౌక్యం ప్రదర్శించాలి. ఆర్థిక మెలకువలు పాటించాలి. కొన్ని ముఖ్య విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలున్నాయి. ప్రమాదాలకు దూరంగా ఉండండి. పెట్టుబడులు ముందుకెళతాయి. శుభవార్తలు వింటారు. కొత్త పనులకు శ్రీకారం. అర్ధనారీశ్వర ఆరాధన ఫలప్రదం.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

అభీష్టాలు అనుకూలిస్తాయి. అనుకున్న పనులు ఆలస్యంగా అయినా పూర్తి. ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాదుల్లో శుభాలను అందుకుంటారు. ఆరోగ్యం ఫరవాలేదనిపిస్తుంది. లౌక్యం మేలు. ఒక విషయం మీ కీర్తిని పెంచుతుంది. పెట్టుబడులు మిశ్రమం. సంతాన సౌఖ్యం. వ్యవహార జయం. వేంకటేశ్వర నామం జపించండి.

 మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి

అదృష్ట ఫలాదులున్నాయి. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. మీ నిర్ణయాలు ఇతరులకు మార్గదర్శకం. విందువినోదాల్లో పాల్గొంటారు. శాంతియుత వాతావరణం నెలకొంటుంది. దూరమైన వారు దగ్గరవుతారు. అపార్ధాలు తొలగుతాయి. ప్రయాణాల్లో మెలకువలు అవశ్యం. అనుకోకుండా పైకం అందుతుంది. కుటుంబ సౌఖ్యం. వినాయక ఆరాధన విజయాలను దగ్గర చేస్తుంది.

– ఎ.సి.ఎం.వత్సల్, 9391137855

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *