సంగీతప్రియుల కోసం

సంగీతప్రియుల కోసం

కర్ణాటక, హిందుస్తానీ భారతీయ సంగీతానికి రెండు కళ్ల వంటివి. ఉత్తరాది వారిది హిందుస్తానీ. ఉత్తర భారతానికి విదేశీ దండయాత్రల తాకిడి ఎక్కువ. వారిని ఈ ధార ఆకర్షించడం ఒక కొత్త పరిణామానికి దారి తీసింది. హిందుస్తానీ రాజాశ్రయం పొందింది. కానీ దీనితో చిన్న చిక్కు కూడా వచ్చింది. విదేశీయులు కాబట్టి సంస్కృత గ్రంథాలతో పరిచయం లేకపోవడం, ముస్లింలు కూడా ఇందులో భాగస్వాములు కావడంతో హిందుస్తానీ సంగీత సంప్రదాయంలో కొంచెం గందరగోళం ఏర్పడిందని చరిత్రకారులు చెబుతారు. ఇలాంటి నేపథ్యంలో భారతీయ సంగీతాన్ని పునరుద్ధరించేందుకు ఉద్భవించినవారే విష్ణు నారాయణ భాత్కండే. మన సంగీతానికి స్వరలిపి, నిశ్చిత రూపం వారి చలవేనని విశ్లేషకులు నిర్ధారించారు. ఆయన ఆలోచనలు ఒక శాస్త్రంగా మరాఠీలో అవతరించాయి. వాటిని ఈగ సాంబయ్య తెలుగులో మనకు అందించారు. ఇదే భాత్కండే సంగీత శాస్త్రం ఒకటో భాగం. గాయకుని లక్షణాలు, అవలక్షణాలు, రాగ విస్తారం వంటి అంశాలు ఇందులో చర్చించారు. కాబట్టి సంగీతం మీద ఆసక్తి ఉన్నవారంతా ఈ పుస్తకం చదవవచ్చు.

భాత్కండే సంగీత శాస్త్రం భాగం-1

ప్రచురణ : ఈగ సాంబయ్య

పుటలు : 325, వెల : రూ.200/-

ప్రతులకు :

1) సాహిత్యనికేతన్‌, కేశవ నిలయం,

బర్కత్‌పురా, హైదరాబాద్‌ – 500 027

ఫోన్‌ : 040-27563236

2) సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,

గవర్నర్‌పేట, విజయవాడ – 500 020

సెల్‌ : 9440643348

– శ్రీరామ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *