ప్రకృతి పరిరక్షణ కోరుకునే ‘ప్రకృతి మాత’ కథలు

ప్రకృతి పరిరక్షణ కోరుకునే ‘ప్రకృతి మాత’ కథలు

ఊహలకే రెక్కలొస్తే స్వేచ్ఛా విహంగంలా సప్త సముద్రాలను చుట్టి విహరిస్తూ ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించాలని అనుకోని వారుండరు. ఆదర్శాలు, ఆశయాలు, ఆకాంక్షలు ఉండాలి. అయితే సాధ్యాసాధ్యాల మాట మరిచిపోగలమా? ఆచరణకు వీలైనప్పుడే సిద్ధాంతాలు నిలబడతాయి. ప్రతి ఒక్కరూ ఆదర్శాలను వల్లించేవారే ! అయితే పునాది రాళ్ళుగా మారాల్సిన ముందుతరాలకు ఎలాంటి మార్గదర్శనం పెద్దలు ఇవ్వడంలేదు. పైన ఉదహరించిన పెద్దల మాటలను దృష్టిలో ఉంచుకొని చెన్నూరి సుదర్శన్‌గా ‘ప్రకృతి మాత’ పరిశీలించాల్సి ఉంటుంది. రచయిత తన అరవై ఆరేళ్ళ అనుభవంలో రాసిన బాలల కథల సంపుటి ఇది. బాలల కొరకు రాసే కథలకు, సామాన్య కథలకు చాలా వ్యత్యాసం ఉంటుంది.

బాలల కథలు చదవడానికి ఆహ్లాదంగా ఉంటూ కుతూహలం కలిగించి చివరకొక మంచి నీతి ఉండాలి.

‘అత్యాశ’ కథలో జామతోటకు వెళ్తే కావలసినన్ని పళ్ళు ఆ తోట యజమాని కోసుకోనిస్తాడు. వ్యాపార సరళిలో పంటలు వేసేవారు, తోటలు వేసేవారు. ఒక చెరుకు గడను గాని, ఒక పండునుగాని ఉచితంగా ఇవ్వరనేది వాస్తవం. పళ్ళు కోస్తూ పడిపోవడం ప్రమాదమా ? లేక దురాశా ?

ఇందులోని కథలు పిల్లలను దృష్టిలో ఉంచుకొని రాసిన కథలులా లేవు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే దిశగా ఉన్నాయి.

ఈ కథల సంపుటిలో 15 కథలున్నాయి. ప్రతీ కథా చదివించేదే. రచయిత తన ఆదర్శాలను, ఆకాంక్షలను, ఆశయాలను ఆవిష్కరించారు. వారి కలలు ఫలించాలని కోరుకుందాం !

ప్రకృతిమాత

(పిల్లల కథలు)

రచన :

చెన్నూరి సుదర్శన్‌

పుటలు : 124

వెల : రూ.80/-

ప్రతులకు :

చెన్నూరి సూదర్శన్‌

హైదర్‌ నగర్‌, హైదరాబాద్‌ – 500 085

సెల్‌ : 9440558748

మరియు

అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

 

– గుమ్మా ప్రసాదరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *