గాలిని శుభ్రంచేసే యంత్రం

గాలిని శుభ్రంచేసే యంత్రం

గాలిని శుభ్రపరిచే యంత్రం వచ్చేసింది. ఈ యంత్రం 7 మీటర్ల (23 అడుగుల) ఎత్తు ఉండి పేటెంటు పొందిన ధనాత్మక అయోనైజేషన్‌ సాంకేతికతను ఉపయోగించి బహిరంగ ప్రదేశాలలో స్మాగ్‌ రహిత గాలిని తయారు చేసి ప్రజలు పరిశుభ్రమైన గాలిని పీల్చుకోడానికి వీలు కల్పిస్తుంది. (పొగ, ధూళితో కూడిన మంచును స్మాగ్‌ అంటారు)

ఢిల్లీలో గాలి నాణ్యత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పొగ ఎక్కువైంది. దీనినని రోజుకు 50 సిగరెట్ల ధూమపానంతో పోలుస్తున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఢిల్లీ ప్రాంతం లోని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని కోరింది. పిల్లలు ఇంటిలోపలే ఉండాలని, ఆరుబయట క్రీడా కార్యక్రమాలు నిలిపి వేయాలని సలహా ఇచ్చింది.

ఈ వాతావరణం మంచిది కాదు

గుర్గావ్‌లో నివసించే ఖ్యాతి బబాని ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుతూ ‘నాకు 3 సంవత్సరాల కూతురు ఉంది. నా కుమారై వారం రోజులకు మించి అస్వస్థతకు గురైంది. ఆమె దగ్గుకు కాలుష్యమే కారణమని వైద్యులు చెప్పారు. నా సైనస్‌ ఎలర్జీ సైతం ఉధృతంగా ఉంది. ప్రస్తుత వాతావరణం ఎవరికీ మంచిది కాదు’ అని చెప్పారు.

ఢిల్లీ ప్రజలందరూ ప్రస్తుత పరిస్థితి పట్ల ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ పరిస్థితి మరింత క్షీణించకుండ ఉండాలంటే అందరూ తమవంతు ప్రయత్నం చేయాలని ఖ్యాతి కోరుతున్నారు. ఎక్కువ చెట్లను నాటడం, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం, బహిరంగ ప్రదేశాలలో పొగ తాగక పోడడం వంటి చర్యలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు పెద్ద స్థాయి ప్రభావం చూపే గణనీయమైన చర్యల అవసరం ఉంది.

’38 సంవత్సరాల డచ్‌ శాస్త్రవేత్త డాన్‌ రూసగార్టె నూతన ఆవిష్కరణ చూసిన తరువాత నాకు పరిస్థితులు మెరుగవుతాయనే విశ్వాసం కలిగింది. భూమిని కాపాడే ఆలోచనాత్మక రూపకల్పనలు చేసేందుకు డాన్‌ సాంకేతికతను, సృజనాత్మక ఆలోచనను ఉపయోగిస్తారు. ఇది చాలా మంచి పరిణామం’ అన్నారు ఖ్యాతి.

అతడి తాజా ప్రాజెక్టు మనం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న మన నగరాల పరిశుభ్రతకు, నగర వాసులు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి ఉపయోగపడొచ్చు అని ఆమె తెలిపారు.

డాన్‌, అతని నిపుణుల బృందం ప్రపంచంలోనే అతిపెద్ద స్మాగ్‌ వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను రూపొందించారు. 7 మీటర్ల (23 అడుగుల) పొడవైన ఈ వ్యాక్యూమ్‌ క్లీనర్‌ పేటెంటు పొందిన ధనాత్మక అయోనైజేషన్‌ టెక్నాలజీని ఉపయోగించి బహిరంగ ప్రదేశాలలో స్మాగ్‌ రహిత గాలిని అందించి ప్రజలు పరిశుభ్రమైన గాలి పీల్చుకొనేందుకు వీలు కల్పిస్తుంది. పర్యావరణ హిత సాంకేతికతను అమర్చిన ఈ పరికరం గంటకు 30,000 క్యూబిక్‌ మీటర్ల గాలిని శుభ్రం చేస్తుంది.

ఈ స్మాగ్‌ వ్యాక్యూమ్‌ క్లీనర్‌ పనిచేసే విధానాన్ని వివరిస్తూ డాన్‌ ఇలా చెప్పారు. ‘సాధారణంగా మీరు ఒక ప్లాస్టిక్‌ బెలూన్‌ను చేతితో రాసినప్పుడు అది స్థిర విద్యుత్‌తో నిండుతుంది (జష్ట్రaతీస్త్రవస షఱ్‌ష్ట్ర ర్‌a్‌ఱష జుశ్రీవష్‌తీఱషఱ్‌వ). అది జుట్టును ఆకర్షిస్తుంది. నల్లని ధూళిలాగా ఉండే స్మాగ్‌ కణాలను కూడా ఆకర్షిస్తుంది’ అన్నారు.

ఇదే సిద్ధాంతాన్ని సైకిళ్ళకు కూడా ఉపయోగించి నేను మరో ఆవిష్కరణ స్మాగ్‌ రహిత సైకిల్‌ను అభివృద్ధి చేశాను. ఈ సైకిల్‌కు ముందు భాగంలో అమర్చిన పరికరం కలుషిత గాలిని తీసుకొని, సైకిల్‌ నడిపే వ్యక్తికి ఆ చుట్టు పక్కల నుంచి పరిశుద్ధ గాలిని అందిస్తుంది.

చైనా, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న కాలుష్యం, రద్దీ వంటి రెండు సమస్యలకు ఈ ఆవిష్కరణ సమాధానం చెప్పగలదని నేను నమ్ముతున్నాను’ అని డాన్‌ అన్నారు.

స్మాగ్‌ వ్యాక్యూమ్‌ క్లీనర్‌ గాని, సైకిళ్ళు గాని కాలుష్య సమస్యను పూర్తిగా పరిష్కరించవని డాన్‌ ఒప్పుకుంటారు. ‘సరైన పరిష్కారాలు అసలు కారణాలపై దృష్టి పెట్టాలి. 2030 నాటికి ఎలక్ట్రిక్‌ కార్లు తిరగాలని భారతదేశం లక్ష్యంగా ఉంచుకుంది. అయితే ఇటువంటి కార్యక్రమాల అమలుకు దీర్ఘకాలం పడుతుంది. ప్రజల భాగస్వామ్యంతో, పరిస్థితులను మెరుగుపరచడంలో మూలాలలో నుండి పనిచేసే ప్రాజెక్టులు ప్రభావవంతంగా ఉంటాయని నా అభిప్రాయం. నేడు సమాజంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన గాలి, నీరు, విద్యుత్తు కోరుతున్నారు. గొప్ప వారికైనా, పేదవారికైనా, ఎవరికైనా స్వచ్ఛమైన గాలి, నీరు కావాలి. వీటిని ప్రజలందరకీ అందించే ఉద్యమంలో భాగంగా నేను ముందుండి, ఉద్యమాన్ని వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు డాన్‌ ది హిందుతో మాట్లాడుతూ.

ప్రస్తుతం ఢిల్లీ ప్రాంత వాసులు ఉన్న నిస్సహాయ పరిస్థితులలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడే ఏ చర్యలైనా స్వాగతింపదగినవే.

– రాంసి నడిమింటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *