ఆ నవ్వులకు కారణం ఓ పళ్ళ డాక్టర్‌

ఆ నవ్వులకు కారణం ఓ పళ్ళ డాక్టర్‌

– సమాజ సేవలో ‘నేను సైతం’ అంటున్న డాక్టర్‌ అంకిత

– పేద రోగుల కొరకు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు

వారాంతపు రోజులు (వీకెండ్స్‌) అనగానే చాలా మంది ఉద్యోగులకు ఉత్సాహం ఉరకలేస్తుంది. గజిబిజి జిందగీ నుంచి కాస్త విశ్రాంతి దొరికినట్లుగా అనిపిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలని రెండు రోజుల ముందుగానే ప్రణాళికలను కూడా సిద్ధం చేసేసుకుంటారు. కాని చాలా తక్కువ మంది మాత్రమే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ సమయాన్ని సమాజ సేవకు వినియోగించాలని భావిస్తారు. దేశానికి ఉడుత భక్తిగా తమ వంతుగా ఏదో చేయాలనే తాపత్రయాన్ని కనబరుస్తారు. ఢిల్లీకి చెందిన డాక్టర్‌ అంకిత కూడా అదే కోవకు చెందిన వ్యక్తి. అంకిత ప్రముఖ దంత వైద్యురాలు. తన వత్తి నలుగురికి మేలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న మనిషి.

అంకిత కలకత్తాలో పుట్టి పెరిగారు. స్వామి వివేకానందుని బోధనలను మనసు నిండా నింపుకున్నారు. ఆమె తండ్రి ఉద్యోగరీత్య వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యేవారు. దీంతో దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామాలను ఆమె చూడగలిగారు. జార్ఖండ్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు. కలకత్తాలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ డెంటల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో డిగ్రీ పట్టాను పొందారు. వివాహానంతరం ఢిల్లీలో నివాసం ఏర్పరచుకున్నారు.

అంకిత ఢిల్లీలోని సఫ్దాద్‌గంజ్‌ హాస్పిటల్లో డెంటల్‌ సర్జన్‌గా వత్తిని ప్రారంభించారు. అంతేకాకుండా డిస్పెన్సరీల్లో కూడా అంకిత పనిచేశారు. ఢిల్లీ పూసారోడ్డు డిస్పెన్సరీలో పనిచేస్తున్నప్పుడు ఆమె వద్దకు వద్ధులే ఎక్కువగా చికిత్స కోసం వచ్చేవారు. ఆ క్రమంలో భారతదేశంలో దంత వైద్యుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు ఆమె గుర్తించారు. తన చికిత్స విధానాన్ని మరింత మెరుగుపరచుకొని నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సంకల్పించుకున్నారు. వివిధ పుస్తకాలను చదువుతూ దంత వైద్యంలో విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. మూడు సంవత్సరాల పాటు తీవ్రంగా శ్రమించారు. అనంతరం దేశంలో వీలైనంత ఎక్కువ మందికి దంత వైద్యాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. కామన్వెల్త్‌ యుకె స్కాలర్‌షిప్‌కు భారత ప్రభుత్వం అంకితను నామినేట్‌ చేసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తున్నారు.

తన చదువనంతరం అంకిత పేదల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. దేశంలో ప్రతి యాభై వేల మంది గ్రామీణ ప్రజలకు కేవలం ఒకే దంతవైద్యుడు అందుబాటులో ఉన్నారని గుర్తించి గ్రామీణ ప్రజల కోసం తానే స్వయంగా దంత సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాలు, మురికివాడల్లో తన సేవా కార్యక్రమాలను విస్తత పరిచారు. నిదానంగా ఉచిత దంత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసేందుకు కావలసిన వనరులను సమకూర్చుకున్నారు. తన తొలి ఉచిత దంత వైద్య శిబిరానికి కావలసిన వంద గ్లౌజులు, మాస్కులు, స్టెరిలైజర్‌ బాటిళ్ళను తానే కొనుగోలు చేశారు. ఆ వైద్య శిబిరాన్ని రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌ జిల్లాలోని హర్సోలి గ్రామంలో నిర్వహించారు. ప్రజల కోసం ఆమె పడుతున్న ప్రయాసను, ఆమెలోని అంకిత భావాన్ని గమనించిన తన తోటి వైద్యులు కూడా స్ఫూర్తిని పొందారు. ఈ సేవా ఉద్యమంలో తామూ భాగస్వాములవ్వాలని ముందడుగు వేశారు. ఒక్కో దంత వైద్య శిబిరం విజయవంతం అవుతున్న కొద్ది అంకిత బందంలో ఉత్సాహం రెట్టింపైంది. మరింత ఎక్కువ మందికి సేవలందించాలనే భావన కలిగింది. అలా వారి వారాంత సమయాన్ని, సంపాదనలో కొంత మొత్తాన్ని గ్రామీణుల ముత్యాల పళ్ళను కాపాడానికి కేటాయిస్తూ వద్ధుల ముసిముసి నవ్వులకు కారణమవుతున్నారు.

ప్రస్తుతం అంకిత వద్ద ఓ మొబైల్‌ డెంటల్‌ ట్రీట్‌మెంట్‌ వాహనం ఉంది. దాని ద్వారా దంత వైద్య శిబిరాలను ఆమె నిర్వహిస్తున్నారు. శిబిరం పూర్తయిన తరువాత ఆ వివరాలను ఆమె ప్రభుత్వానికి అందిస్తారు. అందులో గ్రామంలోని ప్రజల దంత ఆరోగ్యం ఎలా ఉంది? ఎటువంటి చర్యలు చేపట్టవలసి ఉంది? అనే అంశాలనే పొందుపరుస్తారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఫ్లోరైడ్‌ నీటి సమస్య ఎక్కువగా ఉంది. దీంతో అక్కడి ప్రజలు దంత, ఎముకలకు సంబంధించి వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ సమస్య నుంచి జైపూర్‌లోని బాధితులను బయటపడేయడానికి అంకిత బందం కషి చేస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఫ్లోరైడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఇందుకు తమలాంటి ఆలోచనలు కలిగిన వారితో అంకిత పనిచేస్తున్నారు. త్వరలోనే ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఫ్లోరైడ్‌ ముప్పును నివారిస్తామని అంకిత ఎంతో ధీమాగా చెబుతున్నారు. తన సేవలను మరింత విస్తతంగా పేదలకు అందించడానికి కషి చేస్తానంటున్నారు ఈ పళ్ళ డాక్టర్‌.

– విజేత

– ది బెటర్‌ ఇరడియా సౌజన్యరతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *