వారఫలాలు 08 – 14 అక్టోబర్‌ 2018

అన్ని రాశులవారికి అదృష్ట సంఖ్యలు : 1,2,3,4,5,8,9

  మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

లాభ ప్రదం. ఆలస్యంగా అయినా అనుకున్నవి పూర్తి చేస్తారు. అనుబంధాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక ప్రవృత్తి మేలు చేస్తుంది. విజయాలు అందుకుంటారు. సమష్టి వ్యవహారాల్లో సృజనాత్మక ఉంది. ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లండి. సంతోషం విస్తరిస్తుంది. మీ సూచనలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన మంచిది.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విశ్లేషించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక విషయాలు ఫలదాయకం. వృత్తి, ఉద్యోగాదులందు మెలకువలు మేలు. సర్దుకుపోవటమే మంచిది. దూర ప్రయాణాలున్నాయి. వాహన సౌఖ్యం ఉంది. పెట్టుబడులు రాబడులకు మార్గాలు. ఇష్టదైవారాధన ఉత్తమం.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

బుద్ధిబలంతో వ్యవహరించండి. కొన్ని ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు ఆలోచించాలి. స్త్రీలు అనుకున్నవి సాధిస్తారు. భవిష్యత్తు బాగుంటుంది. ధనయోగముంది. ఖర్చులు పెరుగుతాయి. హితుల సాయం అందుకుంటారు. అభీష్టాలు నెరవేరుతాయి. పెట్టుబడులు మిశ్రమం. ఎంచుకున్న రంగాలు ఫలప్రదం. శ్రీవిష్ణు దర్శనం శ్రేయస్కరం.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కార్యసిద్ధి ఉంది. సంపద వృద్ధి చెందుతుంది. దైవానుగ్రహం ఉంది. విలువైన వస్తువులు అందుకుంటారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపార, వ్యవహార రంగాల్లో మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్య సూత్రాలు పాటించండి. ఇష్టదైవాన్ని దర్శించండి.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

ధైర్యంగా ముందుకు వెళ్లండి. ధన లభ్యత ఉంది. శత్రువులు మిత్రులవుతారు. నిబద్దతతో పనులు చేయండి. శుభ సంకేతాలు అందుకుంటారు. అధికారుల మెప్పు పొందుతారు. బుద్ధి బలంతో విఘ్నాలు తొలగించుకుంటారు. కార్యసిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగాల్లో నైపుణ్య వృద్ధి. ఆశయాలు నెరవేరుతాయి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

విజయావకాశాలున్నాయి. ధైర్యంగా ముందడుగు వేయండి. అంతా మన మంచికే అన్నట్లుంటుంది. ఓపికగా ఉండటం మంచిది. ఎదుగుదల ఉంటుంది. మౌనం అన్నింటా మేలు. పేరు ప్రతిష్టలు వృద్ధి. ఎంచుకున్న రంగాల్లో అభివృద్ధి. బగళ ధ్యానం సౌభాగ్యప్రదం.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

ప్రతికూలతలున్నా మీ లౌక్యంతో సానుకూలంగా మారుతాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. విమర్శలకు తావివ్వకండి. గమనింపు అన్నింటా మేలు. ఆలోచనలకు అనుగుణంగా మెలగండి. శుభకార్యాలకు అనుకూలం. అనుకున్నవి అన్నింటా సాధిస్తారు. విద్య, వైద్య రంగాల్లో శుభపరిణామాలు. గణేశ దర్శనం సౌఖ్యప్రదం.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

సమయానికి పైకం అందుతుంది. శుభ సమయం. అప్రస్తుత అంశాలు ఇబ్బంది పెట్టేట్లున్నాయి. సమస్యల్ని లౌక్యంతో పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల సాయం తీసుకోవాలి. సంతోషానికి యోగపడే పనులు చేస్తారు. విలువైన వస్తువులు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలందు అప్రమత్తంగా ఉండాలి. బగళ స్మరణం శుభప్రదం.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

మీ మాట నేర్పు, ఓర్పుతో అన్నింటా ముందుంటారు. బాధ్యతలు అనుకూలిస్తాయి. ఇతరులను గమనించాలి. వారి చర్యలు ఆకళింపు చేసుకోవాలి. ఖర్చులు అధికమవుతాయి. ఏకాగ్రత అన్నింటా మేలు. ఈ వారం కొన్ని పనులు నత్తనడకనుంటాయి. పెట్టుబడులు రాణిస్తాయి. భగవతీ దర్శనం శుభప్రదం.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ సలహాలు ఇతరులకు ఉపకరిస్తాయి. మీ ఆధ్వర్యంలో మంచి కార్యాలు జరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహారాలు యోగిస్తాయి. అప్పు తీసుకున్న వారి దగ్గర నుంచి ఒత్తిడికి అవకాశాలు. ఆలోచన సౌఖ్యదాయకం. అంతా మంచి శకునాలున్నాయి. నవగ్రహధ్యానం నవ్యప్రదం.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

అభీష్ట సిద్ధి. కాలాన్ని వృథా చేయవద్దు. భూ, వాహన సౌఖ్యాలున్నాయి. కష్టపడి పనలు చేయాల్సి వస్తుంది. మీ సమయస్ఫూర్తితో అన్నీ చక్కదిద్దుకుంటారు. నిర్ణయాత్మక దృష్టి, దూరదృష్టి మేలు. హితుల సాయముంది. సంతోషంగా గడుపుతారు. లక్ష్మీధ్యానం లక్ష్యదాయకం.

 మీనం

ఈ వారం అన్నింటా మేలు. ఆలస్యంగా అయినా పనులు పూర్తి. ఆర్థిక అవసరాలు తీరుతాయి. ఇతరులను తేలికగా నమ్మకండి. స్వీయ నియంత్రణ మేలు. అనుకున్నవి అందుకుంటారు. అనుకోని ప్రయాణాలున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త. శుభవార్తలు వింటారు. ఎంచుకున్న రంగాలలో సౌఖ్యాలున్నాయి. హరిహర స్మరణం శుభకరం.

– ఎ.సి.ఎం.వత్సల్, 9391137855

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *