వారఫలాలు 03 – 09 డిసెంబర్‌ 2018

అన్ని రాశులవారికి అదృష్ట సంఖ్యలు : 1,2,3,5,7,8,9

  మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

కార్యసిద్ధి. లౌక్యంగా ముందుకెళ్లండి. దైవానుగ్రహం ఉంది. ఆర్థిక అనుకూలతలున్నాయి. ఉద్యోగ, వృత్తి, వ్యవహారాలందు జాగ్రత్తలు తీసుకోండి. అనవసర హామీలు వద్దు. ఆరోగ్యం జాగ్రత్త. బంధువుల రాక ప్రయోజనకరం. ఇతరుల మాటల్ని నమ్మకండి. పెట్టుబడులు దీర్ఘకాలికం. హనుమంతుని ధ్యానించండి.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

శుభ సమయం. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాలందు అనుకూలతలు చూసుకోవాలి. కీర్తి ప్రతిష్ఠలు శ్రమానుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న రంగాల్లో వృద్ధి. పెట్టుబడులు వనరులకు అనుకూలంగా చూసుకోండి. నిరుద్యోగులకు అవకాశాలు. స్త్రీలు కావలసినవి అందుకుంటారు. శివ, శివానీ ధ్యానం ఉత్తమ ఫలదాయకం.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆపదల నుండి బయటపడతారు. ప్రయత్న లోపం రానీయకండి. వ్యాపార, వృత్తి, వ్యవహార రంగాల్లో నైపుణ్యం అవసరం. క్లిష్టమైన వాటిని తేలికగా పరిష్కరిస్తారు. అన్నింటా శుభాలున్నాయి. కష్టపడితేనే ఫలితాలుంటాయి. విష్ణుధ్యానం అభీష్టప్రదం.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

ఆర్థిక అనుకూలతలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, సాంకేతిక రంగాలు ఊహించినట్లుగా ఉంటాయి. ప్రయివేట్‌ రంగం వారికి శుభకాలం. తొందరపాటు వద్దు. సుఖసంతోషాలున్నాయి. సంకల్పాలు నెరవేరతాయి. సంపదలు విస్తరిస్తాయి. అపోహలు తగ్గుతాయి. సుబ్రహ్మణ్య స్తవం మేలు.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

అన్నింటా విజయాలు. ఎదుటివారిని గమనించండి. తలవని తలంపుగా కొన్ని పనులు చేస్తారు. సాధించాలనుకున్నవి సాధిస్తారు. మిత్రులతో సంబంధాలు ఫలవంతం. నిదానంగా, నిర్ణయాత్మకంగా మెలగాలి. ఆస్తి విషయాలు పరిష్కారమవుతాయి. పెట్టుబడులు మిశ్రమం. ఆలోచనలతో పనులు చేస్తేనే అనుక్నునవి సిద్ధిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

ధనలాభముంది. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. అదృష్ట యోగం ఉంది. కార్యజయం. వస్తు, వస్త్ర ప్రాప్తి. చంచలత్వం వద్దు. అచంచల భక్తి శక్తినిస్తుంది. పెట్టుబడులు మిశ్రమం. పెట్టుబడులకు వనురులున్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు విస్తరిస్తాయి. నవగ్రహ స్మరణం నవ్య ప్రదం.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

పట్టుదలగా ఉంటారు. అన్ని విషయాల్లో స్వీయ పర్యవేక్షణ మేలు. ఉత్తమ భవిష్యత్తు గోచరిస్తుంది. అందర్నీ తేలికగా నమ్మవద్దు. కొన్ని పనులు మందకోడిగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణాలు అనుకున్నట్లుగా కొనసాగవు. లేనిపోని విషయాల్లో తలదూర్చకండి. ఆర్థిక ప్రగతి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

ఆరోగ్యం జాగ్రత్త. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యమైన వ్యక్తుల నుంచి సాయమందుతుంది. కలహాలు వద్దు. ఇతరులకు సాయపడతారు. ఎదుటివారిని గమనించండి. పైకంతో ప్రయాణాలు వద్దు. పెట్టుబడులు ఆలోచింపచేస్తాయి. ఎంచుకున్న రంగాల్లో అనుకూలతలున్నాయి. నరసింహ స్తవం జయప్రదం.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

పనులందు అనుకూలతలు. కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి లాభాలు. గృహమార్పులు. ఆశయాలు అనుకూలిస్తాయి. ఇతరుల సాయం అందుతుంది. తొందరపాటు వద్దు. ఖర్చు తగ్గించుకోండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ప్రగతి. ఆర్థిక శుభకాలం. ఇష్టదైవాన్ని స్మరించండి.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

పెట్టుబడులు వృద్ధి. అన్ని రంగాల్లో అనుకూల మార్పులు. అదృష్ట ప్రదమైన సమయం. వడివడిగా కొన్ని పనులు చేయవలసి వస్తుంది. తప్పటడుగులు వేయకండి. ఇతరుల మాటలు నమ్మకండి. ఎదురు చూస్తున్నవి దగ్గరవుతాయి. కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ లాభం. ఏకాగ్రతతో పనులు చేయండి. ఈశ్వర అభిషేకంతో మేలు.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

పట్టుదల, లౌక్యం మీకు రెండు కళ్లలా ఉంటాయి. అన్నింటా సంతోషంగా ముందుకెళతారు. పెట్టుబడులు, రాబడులకు మార్గాలు. సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక ఆనందం వృద్ధి. ముఖ్యమైనవి అందుకుంటారు. వాహన ప్రయాణాలందు మెలకువలు మేలు. ఖర్చుల నియంత్రణ మంచిది. శివారాధన శుభకరం.

 మీనం

పనులందు జవాబుదారీతనం చూపిస్తారు. విశ్రాంతి అవసరం. వృత్తులందు నేర్పు ప్రదర్శిస్తారు. ఇతరులకు సాయ పడతారు. నూతన పనులు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. అనుకోని పైకం లభించేట్లుంది. పరిచయాలు బలపడతాయి. ప్రయాణాలు కలసి వస్తాయి. ఖర్చులు నియంత్రించుకోవాలి. అన్నపూర్ణ ధ్యానం ఆహ్లాదప్రదం.

– ఎ.సి.ఎం.వత్సల్, 9391137855

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *