వారఫలాలు 22 – 28 అక్టోబర్‌ 2018

అన్ని రాశులవారికి అదృష్ట సంఖ్యలు : 1,2,4,6,7,8,9

  మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

ఎంచుకున్న రంగాల్లో ముందుచూపు అవశ్యం. కొన్ని ఇబ్బందు లున్నా మీ నేర్పుతో సర్దుకుంటాయి. కొత్త పరిచయాలతో ప్రయోజనాలు. విద్య, వివాహాది శుభకార్యాలలో కదలిలుంటాయి. పెట్టుబడులకు వనరులుంటాయి. దూరపు బంధువులు వస్తారు. వాహన సౌఖ్యం. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందికరం. వస్త్ర, వస్తు లాభాలున్నాయి. వినాయక స్మరణం సంతోషప్రదం.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

పెట్టుబడులు మిశ్రమం. ఇబ్బందులున్నా కుటుంబ సభ్యుల సహకారంతో తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మిత్రులతో కలసి పాల్గొంటారు. హితుల సాయం ఉండటం వల్ల అనుకున్న పనులు వాయిదా పడకుండా ముందుకెళతాయి. నూతన పరిచయాలు మేలుచేస్తాయి. వస్తు, వస్త్ర లాభాలున్నాయి. శ్రీభవానీ ధ్యానం శ్రేయస్కరం.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

శ్రమానుకూల ఫలితాలుంటాయి. మీరు ఎంచుకున్న రంగాలు ప్రయోజనకారిగా ఉంటాయి. స్త్రీలకు మంచి సమయం. అప్పు చేయవలసి రావొచ్చు. నైపుణ్యాలు మెరుగవుతాయి. అధికారులతో సంయమనం అవశ్యం. ఎంచుకున్న పనులందు దృష్టి పెట్టాలి. శుభకార్యాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇష్టదేవతా ధ్యానం ఆనందాన్నిస్తుంది.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

వృత్తి, వ్యాపార, వ్యవహారాలు గతం కంటే బాగుంటాయి. ఆలోచనాత్మకంగా ముందుకెళ్లండి. తలవని తలంపుగా కొన్ని పనులు పూర్తి అవుతాయి. సంతృప్తి అన్నింటా ఉంది. మీరు చేసే పనులు గౌరవాన్ని పెంచుతాయి. ప్రయాణాలందు మెలకువలు అవసరం. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. శ్రమానుకూల ఫలాలు అందుకుంటారు. ఇష్టదైవ స్మరణం జయప్రదం.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

ఈ వారం అన్నింటా ప్రయోజనాలు అందుకుంటారు. అధికారులు మీ పనులందు సాయపడతారు. మీ కార్యాలందు సానుకూల వాతావరణం ఉంటుంది. పెట్టుబడులు ఫలప్రదం. కుటుంబ బంధాలు విస్తరిస్తాయి. స్వీయ పరిశీలన, పర్యవేక్షణ మేలు. శుభవార్తలు వింటారు. శ్రీ, శ్రీపతి ధ్యానం శుభదాయకం.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

వృత్తి, వ్యాపార, ఉద్యోగాలందు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలందు విలువైనవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆలోచనాత్మకంగా మెలగాలి. విమర్శలకు దూరంగా ఉండండి. అందర్నీ కనిపెడుతూ ముందుకెళ్లాలి. పోటీ పరీక్షలందు ఏకాగ్రత అవసరం. సమయానికి పైకం అందుతుంది. భగవతీ స్మరణం భాగ్యదాయకం.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. శ్రమాను కూలతలు ఉన్నాయి. ఆరోగ్య స్థితి బాగుంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో నైపుణ్యాలు పెంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ముఖ్యమైన కార్యాలందు ఆలోచనలు అవసరం. పెట్టుబడులు మిశ్రమం. శుభవార్తలు వింటారు. సామాజిక కార్యక్రమాలు గుర్తింపునిస్తాయి. మీ బాధ్యతలు మరొకరికి అప్పగించవద్దు. దక్షిణామూర్తి స్మరణం భవ్యప్రదం.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

మనోభీష్టాలు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు నేర్పు ప్రదర్శించవలసి వస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్వీయ పర్యవేక్షణ మంచిది. చుట్టుపక్కల వారిని గమనించండి. ధైర్యంగా ముందడుగు వేయండి. లౌక్యం అవశ్యం. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

లౌక్యంతో పనులు చేయండి. అవకాశాలు చేజార్చుకోవొద్దు. ఒడిసి పట్టుకోవాలి. కుటుంబ ప్రయోజనాలకై యత్నించండి. ఆదాయమున్నా వ్యయ నియంత్రణ మంచిది. ఇతరులకు హామీలు ఇవ్వకండి. ఆర్థిక ప్రగతికై లక్ష్మీస్తవం మేలు. కొన్ని వ్యవహారాలు సుఖదాయకం. ఇష్టదేవతా ధ్యానం శ్రీకరం శుభకరం.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

వివాహాది శుభకార్యాల గురించి ప్రయత్నాలు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. నూతన పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారికి శ్రమాను కూల ఫలితాలుంటాయి. ఖర్చులు అంచనాలకు మించకుండా జాగ్రత్త పడాలి. అనాలోచితంగా ఏ పని చేయవద్దు. ఒత్తిడులు నైపుణ్యంతో అధిగమించండి.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సంతృప్తి. బంధువర్గంతో మాట పట్టింపులు వద్దు. నిర్మాణ పనులందు మార్పులకు అవకాశం. విశ్రాంతి అవసరం. ఎంచుకున్న రంగాలు ఫలప్రదం. ప్రయాణాలు వద్దు. వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. వస్తు, వస్త్ర ప్రాప్తి. పైకం అందుతుంది. అనుకోని వ్యయాలున్నాయి. శివస్మరణం శుభప్రదం.

 మీనం

ఆదాయ, వ్యయాలు సరిసమానం. జయాలు అన్నింటా ఉన్నాయి. ఎంచుకున్న రంగాల్లో ప్రగతి. అవకాశాలు అనుకూలిస్తాయి. వస్తు, వాహన సౌఖ్యాలున్నాయి. విద్య, వైద్య రంగాలవారు ప్రయోజనాలు అందుకుంటారు. కోర్టు విషయాలు ముందుకెళ్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. పెట్టుబడులు మిశ్రమ ఫలాలను ఇస్తాయి. ఇష్టదైవ ధ్యానం అభీష్టదాయకం.

– ఎ.సి.ఎం.వత్సల్, 9391137855

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *