వారఫలాలు 18-24 మార్చి 2019

 మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

వ్యూహాత్మకంగా వ్యవహరించి కొన్ని విషయాలలో ముందడుగు వేస్తారు. ఆత్మీయుల సలహాలు, సూచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. హోదాలు కలిగిన వారితో పరిచయాలు. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. శివాలయంలో 11 ప్రదక్షణలు చేయండి.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

గతాన్ని గుర్తుకు తెచ్చుకుని కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుంటారు. పెండింగ్‌లోని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్యసందేశం అందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. సినీరంగం వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. విష్ణుధ్యానం చేయండి.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

సన్నిహితులు, స్నేహితులతో విభేదాలు పరిష్కారం. రాబడి అందుతుంది. మీ సహాయంకోసం చిరకాల మిత్రుడు ఆశ్రయిస్తాడు. కొత్త కాంట్రాక్టులు పొంది ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొద్దిపాటి రుగ్మతలు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. సోదరులు, సోదరీలతో సఖ్యత నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహక రంగా ఉంటాయి. క్రీడాకారులకు నూతనోత్సాహం. శివస్తోత్రాలు పఠించండి.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

ఉత్సాహవంతంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీకు అన్నింటా సహకరిస్తారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. పట్టుదలతో కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. పరిచయాలు పెరుగుతాయి. రాబడి అనూహ్యంగా పెరిగి అప్పులు తీరుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనసౌఖ్యం. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. దక్షిణామూర్తిని పూజించండి.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

కీలక నిర్ణయాలను వాయిదా వేయండి. ఇతరుల విషయాలలో జోక్యం వల్ల సమస్యలు ఎదురవుతాయి. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. ప్రత్యర్థులు మీపై ఆరోపణలు గుప్పిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కళాకారులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించండి.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

అనుకున్న రాబడి పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. సోదరీ, సోదరులతో మరింత ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. రచయితలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళాకారులు, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

మీరు పట్టిందిల్లా బంగారమే. మీపై వచ్చిన నిందలు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి, ధన లాభాలు ఉంటాయి. స్నేహితులు మరింత సహకరిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పారిశ్రామికవర్గాలు, వైద్యులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. విద్యార్థులు విజయం సాధిస్తారు. పలుకుబడి, హోదాలు కలిగిన వారితో పరిచయాలు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సోదరులు, సోదరీలతో ఉత్తరప్రత్యుత్త రాలు సాగిస్తారు. చిరకాల ప్రత్యర్థులను అనుకూలంగా మార్చుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. నాయకులకు పదవీయోగం కలుగుతుంది. శివాలయంలో అభిషేకం జరిపించండి.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

ప్రారంభంలో కొన్ని సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రతిభకు తగిన ప్రోత్సాహం అందుతుంది. ఆర్థికపరంగా కొంత అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులు, రచయితలకు నిరుత్సాహం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

కొన్ని సమస్యలను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. మీ సలహాలను కుటుంబసభ్యులు పాటిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆదాయం సమకూరుతుంది. సేవాకార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నాయకులు, పారిశ్రామికవేత్తలకు పురస్కారాలు, సన్మానాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

 మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి

ఏ పనిచేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. సోదరులు, సోదరీలతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. శారీరక రుగ్మతలు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆత్మీయుల సహాయం అందుతుంది. రాబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు, ఇబ్బందులు అధిగమిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి. శివపంచాక్షరి పఠించండి.

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *