వారఫలాలు 18-24 మార్చి 2019

 మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. సమస్యల బారి నుంచి బయటపడతారు. వాహనాలు, గహం కొనుగోలులో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు అవకాశాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణబాధల నుంచి విముక్తి. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా ధనలబ్ధి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం. దేవీస్తోత్రాలు పఠించండి.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

ఎంతటి పని చేపట్టినా విజయవంతమే. ఆలోచనలు మరింత కలిసివస్తాయి. మీ నిర్ణయాలు అందరికీ శిరోధార్యంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సోదరులతో దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలు సర్దుబాటు. వ్యాపారాలలో కోరుకున్న లాభాల దిశగా సాగుతారు. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తిచేస్తారు. శివాష్టకం పఠించండి.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

కొన్ని కార్యక్రమాలు శ్రమ పడ్డా పూర్తి కావు. మిత్రులతో అకారణంగా తగాదాలు. శ్రమకు తగిన ఫలితం రాక డీలాపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడతారు. కాంట్రాక్టులు తటిలో తప్పిపోతాయి. రావలసిన డబ్బు అందక ఇబ్బందులు పడతారు. బంధువుల నుంచి ఒత్తిడులు. మీ నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. కొంత నలత చేసి ఇబ్బంది పడతారు. ఉద్యోగాలలో మార్పులు తథ్యం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

స్థిరాస్తి వివాదాలు తీరి కొంత లబ్ధి చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. సొమ్ముకు లోటు ఉండదు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట లభిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఎంతటి బాధ్యత అయినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆదిత్య హృదయం పఠించండి.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

నూతన కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ప్రముఖులు మీకు చేదోడుగా నిలుస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. కొంత నలత తప్పదు. వ్యాపారాలలో క్రమేపీ లాభాల బాటపడతారు. ఉద్యోగాలలో మీపై ఉన్నతాధికారులు నమ్మకం పెంచుకుంటారు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

నిరుద్యోగులకు వారం చివరలో శుభవార్తలు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. వారసత్వ ఆస్తుల ద్వారా లబ్ధి చేకూరు తుంది. రుణదాతల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు మరింత ఊపందుకుంటాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలు తీరతాయి. కొన్ని రుగ్మతల నుంచి బయటపడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పైస్థాయి నుంచి మీపై ప్రశంసలు కురుస్తాయి. ఆదిత్య హృదయం పఠించండి.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

అనుకున్న పనులు కొంత నెమ్మదిస్తాయి. చిరకాల శత్రువులు మిత్రులుగా మారతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. రావలసిన సొమ్ము అందుతుంది. మీపై కుటుంబ సభ్యులు మరింత నమ్మకం వ్యక్తంచేస్తారు. కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు మరింత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

మొదట్లో ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖులు పరిచయమవుతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వేడుకలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. శివపంచాక్షరి పఠించండి.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. అప్రయత్నంగా సొమ్ము దక్కి అవసరాలు తీరతాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు అనూహ్యమైన అవకాశాలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

అనుకున్న కార్యాలలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురుకావచ్చు. విద్యార్థులకు అవకాశాలు దక్కించుకుంటారు. కుటుంబంలోని అందరి ప్రేమాభిమానాలు పొందుతారు. వివాహాది శుభకార్యాలు ఉత్సాహంగా జరుపుతారు. కొద్దిపాటి నలత చేసి ఇబ్బంది పడతారు. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు ప్రమోషన్లు లభిస్తాయి. ఆదిత్య హృదయం పఠించండి.

 మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. సోదరీలు మీ సహాయం అందుకుంటారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. గృహ నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కనకధారా స్తోత్రాలు పఠించండి.

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *