వారఫలాలు 15-21 ఏప్రిల్‌ 2019

 మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు. తీర్థయాత్రలు చేస్తారు. రావలసిన సొమ్ము అందుకుంటారు. సంతానం, ఉద్యోగ విషయంలో శుభవార్తలు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలలో లాభాలు. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. గహ నిర్మాణాలు చేపట్టే వీలుంది. డబ్బుకు లోటు రాకుండా గడుపుతారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, పరిశోధకులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. శివారాధన మంచిది.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. అప్రయత్నంగా సొమ్ము అందుతుంది. రుణబాధలు తొలగుతాయి. సంతానం నుంచి కీలక సందేశం అందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులు కొత్త హోదాలు సాధిస్తారు. రాజకీయ వేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. ఆదిత్య హృదయం పఠించండి.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. స్నేహితులతో తగాదాలు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త రుణాలు చేస్తారు. ఉద్యోగావకాశాలు చేజారతాయి. శారీరక రుగ్మతలు, వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. పెట్టుబడులకు అన్వేషిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. న్యాయవాదులు, రాజకీయవేత్తలు, సాహితీవేత్తలకు సమస్యలు తప్పకపోవచ్చు. లక్ష్మీస్తుతి మంచిది.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. విద్యార్థులు అను కూల ఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభను అంతా గుర్తిస్తారు. సంతాన పరంగా ఇబ్బందులు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. కొంత నలత చేసినా తక్షణం ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు వృద్ధి, లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. వైద్యులు, న్యాయవాదులు, పారిశ్రామికవేత్తలకు మరింత ఉత్సాహం. రామరక్షాస్తోత్రాలు పఠించండి.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత విముక్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. సొమ్ము అంది అవసరాలు తీరతాయి. మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో లాభాలు ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. శివాష్టకం పఠించండి.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థులకు ఆశాజనకం. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. సకాలంలో డబ్బు అందుకుంటారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులు అంచనాలు నిజం చేసుకుంటారు. పదోన్నతులు రావచ్చు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహం. గణేష స్తోత్రాలు పఠించండి.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఇదే మీ విజయా లకు బాట వేస్తుంది. ముఖ్య వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రావలసిన సొమ్ము అందు కుంటారు. ఆరోగ్యం మెరుగుపడి ఊరట లభిస్తుంది. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయవేత్తలు, పరిశోధకులు, రచయితలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఎంతటి బాధ్యతైనా పట్టుదలతో నెరవేరుస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కారం. ఆకస్మిక ధనలాభం. రుణాలు చాలా వరకూ తీరతాయి. కుటుంబసభ్యులు మీపై మమకారం పెంచుకుంటారు. సోదరులు, సోదరీలతో కష్టసుఖాలు పంచుకుంటారు. కొన్ని రుగ్మతల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో మార్పులు తప్పవు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

మధ్యమధ్యలో కొన్ని చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. నిరుద్యోగులకు అనుకూల పరిస్థితులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. సన్నిహితుల ద్వారా ధనలబ్ధి. ఆరోగ్యం మెరుగుపడి ఊరట లభిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రత్యేక హోదాలు రాగలవు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

మీ ఊహలు, అంచనాలు నిజం చేసుకుంటారు. నిరుద్యోగులకు చిరకాల కోరిక నెరవేరుతుంది. వివాహయత్నాలు కలసివస్తాయి. అప్రయత్నంగా సొమ్ము అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి. వైద్యసేవలు పొందుతారు. ఉద్యోగులు సమస్యలు తీరి మనశ్శాంతి చేకూరుతుంది. రాజకీయవేత్తలు కొత్త పదవులు అందుకుంటారు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

 మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి

ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిత్రవిచిత్ర సంఘటనలతో ఆశ్చర్యపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఇంతకాలం పడిన ఇబ్బందులు తీరతాయి. కుటుంబ సభ్యులు మీపై మరింత ప్రేమ చూపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *