వారఫలాలు 11-17 మార్చి 2019

 మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

ముఖ్య కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. కుటుంబ సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. శివపంచాక్షరి పఠించండి.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

ముఖ్య కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. అపవాదులు తొలగుతాయి. అందరితోనూ సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

ముఖ్య పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. కాంట్రాక్టర్ల యత్నాలు సఫలం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆకస్మిక ధనలాభం. కుటుంబసమస్యలు క్రమేపీ తొలగుతాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు కోరుకున్న ప్రమోషన్లు. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబంలో సంతోషదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగులు తమపై వచ్చిన నిందల నుంచి బయటపడతారు. విష్ణుధ్యానం చేయండి.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. నిరుద్యోగులకు అవకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబసభ్యులతో సఖ్యత నెలకొంటుంది. కొద్దిపాటి శారీరక రుగ్మతలు తప్పవు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు లక్ష్యాలు నెరవేరతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ యానం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు, స్థిరాస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కొద్దిపాటి శారీరక రుగ్మతలు. వ్యాపారులకు మరింత ఉత్సాహం. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే అవకాశం. ఆంజనేయ దండకం పఠించండి.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

ఉపయుక్తమైన సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. కుటుంబ సమస్యలు తీరతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఐటీ నిపుణులు నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తారు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో పేరుప్రతిష్ఠలు దక్కుతాయి. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. సోదరులు, సోదరీల ప్రేమానురాగాలు పొందుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. వాహనయోగం. వ్యాపారులు లాభాల బాటపడతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం. ఆదిత్య హృదయం పఠించండి.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. ఆదాయం కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. బంధువుల నుంచి పిలుపు రావచ్చు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారుల కృషి ఫలిస్తుంది. రాజకీయవేత్తలకు ప్రజాదరణ పెరుగుతుంది. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. రాబడి కొంత పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు సంతోషకర సమాచారం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

కష్టానికి ఫలితం దక్కించుకుంటారు. మీ అభిప్రాయాలు అందరూ గౌరవిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవర్తమానాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. కాంట్రాక్టులు పొందుతారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి. పదోన్నతులు రావచ్చు. గణేశాష్టకం పఠించండి.

 మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. దేవాలయాలు సందర్శిస్తారు. స్నేహితులతో కలహాలు. స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. ఆర్థిక, కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. శారీరక రుగ్మతలు. కష్టానికి ఫలితం అంతగా కనిపించదు. కొన్ని నిర్ణయాలు సైతం మార్చు కుంటారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. శివాష్టకం పఠించండి.

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *