వారఫలాలు 07-13 జనవరి 2019

ఈ వారం అన్ని రాశులవారికి అదృష్ట సంఖ్యలు : 1,3,6,7,9

 మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం
ఆర్థిక ప్రగతి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగులకు ప్రమోషన్లు. వృత్తి రంగాల వారికి పోటీలు అధికం. వనరులు సమకూరుతాయి. ప్రయాణాలందు అలసత్వం వద్దు. సమష్టి నిర్ణయాలు ఫలిస్తాయి. పెట్టుబడులు మిశ్రమం. అన్నింటా గుర్తింపు లభిస్తుంది. హితుల సాయమందుతుంది. సుబ్రహ్మణ్య స్మరణం మేలు.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

శీఘ్ర విజయం. తొందరపాటు పనికిరాదు. సమస్యలు నెమ్మదిగా పరిష్కారమవుతాయి. ఖర్చుల నియంత్రణ మేలు. ఆలస్యంగా అయినా కార్యసిద్ధి. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు. ఆస్తి వృద్ధి. శాంతి ప్రాప్తి. మిత్రుల సాయమందుతుంది. మీ ప్రణాళికలు యోగిస్తాయి. శివధ్యానం శుభప్రదం.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

చేసిన పనులు మరలా చేయవలసి వస్తుంది. నైపుణ్యం ఉపకరిస్తుంది. అవకాశాలు అనుకున్నట్లు అందుతాయి. శ్రమానుకూల ఫలితాలున్నాయి. హితుల సాయం ఉంటుంది. పెట్టుబడులు మిశ్రమం. కొన్ని విషయాలు స్ఫూర్తినిస్తాయి. ఆగ్రహం వద్దు. శుభాలుంటాయి. ఇష్టదైవాన్ని ధ్యానించండి.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

ప్రయత్నలోపం లేకుండా చూసుకోవాలి. ఆశించిన ఫలాలు అందుతాయి. ధనప్రాప్తి. అడ్డంకులు తొలగుతాయి. సమాజంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలున్నాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. సుఖసంతోషాలున్నాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఆశించినవి అందుతాయి. లక్ష్మీధ్యానం యోగదాయకం.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అన్నింటినీ లౌక్యంతో అధిగమించండి. కొత్త ఆలోచనలు చేస్తారు. తొందరలు వద్దు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలమైన, హితమైన మార్పులు. అదృష్టాన్ని అందుకుంటారు. కార్యసిద్ధి. సమస్యలు తగ్గుతాయి. వాహన యోగం ఉంది. శివానీ స్మరణం దుఃఖ హరణం.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు. నిర్ణయాత్మకంగా చేసే పనులతో సంతోషం. కర్తవ్యాలు లోపరహితంగా చూసుకోండి. హితుల వల్ల మేలు కలుగుతుంది. అనుకోకుండా ఆస్తి విషయాలు ముందుకెళతాయి. పెద్దల ఆశీస్సులు అందుతాయి. ప్రశాంతంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలు ఆలోచింపచేస్తాయి. స్త్రీలకు శుభాలు. వేంకటేశ్వర ధ్యానం సౌఖ్యప్రదం.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

ప్రణాళికల మేరకు ముందుకెళ్లండి. శుభాలున్నాయి. నిబద్ధత మీకు ఆభరణం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహారాలు ముందుకెళతాయి. సమాజంలో పేరు సంపాదిస్తారు. విలువైనవి ప్రాప్తిస్తాయి. అనుకోని ప్రయాణాలున్నాయి. అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. పెట్టుబడులు శుభాలనిస్తాయి. జయ ప్రాప్తి. సంతోషాలు విస్తరిస్తాయి. దక్షిణామూర్తి స్మరణం ఆహ్లాదకరం.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

నిర్ణయాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాల్లో శుభాలు అందుకుంటారు. ముఖ్యమైన కార్యాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలతో లోపరహితంగా పనులు చేయండి. సుఖాలున్నాయి. అన్ని దిశల నుండి మంచి వార్తలు వింటారు. శరవణభవ ధ్యానం శుభప్రదం.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

విజయప్రాప్తి. నైపుణ్యంతో ప్రగతిని అందుకుంటారు. సమయానికి డబ్బు సర్దుబాటవుతుంది. మీరు చేసే పనులు ఇతరుల్ని ఆకర్షిస్తాయి. అన్నింటా ధైర్యంగా ఉండండి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. కార్యసిద్ధి ఉంది. ఆచి తూచి మాట్లాడండి. ఇష్టదేవతా స్మరణం మేలు. ఖర్చులు తగ్గించుకోండి.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆధ్యాత్మిక శక్తి యోగిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. పెద్దల ఆశీస్సులు అందుతాయి. పట్టుదలతో మెలగండి. ఆర్థిక సౌఖ్యం. వ్యయాలను తగ్గించుకోవటం మంచిది. ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లండి. విశ్రాంతి తీసుకోవాలి. వ్యాపారాల్లో పోటీలుంటాయి. విదేశీ విషయాలు అనుకూలిస్తాయి. మంచి వార్త వింటారు. శివ, శివానీ ధ్యానం సౌఖ్యప్రదం.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

బద్ధకాన్ని వదలండి. అన్నింటా జగ్రత్తలు పాటించాలి. వ్యతిరేకతల్ని అనుకూలతలుగా మార్చుకుంటారు. సమస్యలు పరిష్కరిస్తారు. అనుకున్నట్లే అన్నీ పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభ విస్తరణ. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూలత. ఆర్థిక లాభాలు అందుతాయి. అధికారిక విషయాల్లో తృప్తి. సౌఖ్య ప్రాప్తి. వినాయక ధ్యానంతో విజయం.

 మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి

పరిచయాలు ప్రయోజనకారులవుతాయి. ఆలోచనలకు రూపకల్పనలుంటాయి. పెట్టుబడుల్లో జాగ్రత్త. కాలనుగుణంగా వ్యవహరించండి. ఎంచుకున్న రంగాలు తృప్తినిస్తాయి. తొందరలు వద్దు. సమస్యల్ని అధిగమిస్తారు. ఆధ్యాత్మిక ఉన్నతి. అన్నింటా శుభ పరిణామా లున్నాయి. సమయాన్ని వృథా చేయకండి. ఇష్ట దైవాన్ని ధ్యానించండి.

– ఎ.సి.ఎం.వత్సల్, 9391137855

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *