వారఫలాలు 11-17 జూన్‌ 2018

అన్ని రాశులవారికి అదృష్ట సంఖ్యలు : 2,4,5,6,7,8,9

 మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

ఆర్థిక లావాదేవీలు అనుకూలం. శుభ ప్రయత్నాలు. నైపుణ్యంతో పనులు పూర్తి. అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. ఓర్పు, నేర్పులను ప్రదర్శించాలి. ఎదురు చూస్తున్నవి అందుతాయి. బంధువుల రాక ప్రయోజనకారి. తొందర వద్దు. పెట్టుబడులకై ఆలోచించి, పైకం అర్థవంతంగా ఖర్చు పెట్టాలి. కోర్టు విషయాలు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. అన్నపూర్ణ స్మరణం ఆనందప్రదం.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

మంచి సమయం. నెమ్మదిపై పనులు పరిష్కరించుకొని కొత్తవి ఆవిష్కరించుకుంటారు. బరువులు శక్తికి మించకుండా చూసుకో వాలి. విశ్రాంతి అవసరాన్ని గుర్తించాలి. క్రమంగా వృద్ధి. మీ పనులు ఇతరులకు మార్గదర్శకాలు. అనుకోని ప్రయాణాలు. కొన్నింట నిర్ణయాలు వ్యతిరేకం కాకుండా చూసుకోవాలి. గమనింపుతో పెట్టుబడులు. దంపతులు అన్యోన్యతకు ప్రాధాన్యమివ్వండి. శుభవార్తలు, మేలైన నిర్ణయాలుంటాయి.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

పైకం సర్దుబాటు, వ్యవహారాల దిద్దుబాటులు ఉంటాయి. పొరపాట్లు రాకుండా గమనించండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహారాలు గమనింపుతో ఒత్తిడి లేకుండా మసలుకోండి. కొన్ని సమస్యలు లౌక్యంతో పరిష్కరించుకుంటారు. ప్రయత్నాలు అనుకూలం. విజయ ప్రాప్తి. శుభకార్యాలకు పైకం అనవసరంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. నైపుణ్యాన్ని ప్రదర్శించండి. శ్రీ, శ్రీపతి ధ్యానం శుభం.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

ఆర్థిక పరిస్థితి అంచనాలు మారతాయి. వివాదాలకు దూరం. ఎదుటి వారిని గమనిస్తూ ప్రయాణించాలి. పట్టుదల చేపట్టి పనులు పూర్తయ్యేదాక ఉండాలి. కుటుంబంలో మీతో సహా అందరూ సంతోషంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలు దినదినాభివృద్ధి. ఆలస్యం, అలసత్వం, దంపతుల మధ్య స్పర్థలు, వాదప్రతివాదాలు వద్దు. విలువైనవి పొందుతారు. లక్ష్యాలు నెరవేరుతాయి. ఇష్ట దేవతా స్మరణ అభిష్ట ప్రదం.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1పాదం

గురు, శని, మంగళవారాలు కొన్ని సదుపాయాలు అందుకుంటారు. విత్త వృద్ధి. మీ అంచనాలకు అనుగుణంగా ఖర్చు నియంత్రించుకో వాలి. వృత్తి, ఉద్యోగాలందు నెమ్మది మేలు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు. అప్పులు తగ్గుతాయి. సాధారణ వ్యవహారాలు పూర్తి. గృహ ప్రయత్నాలు అనుకూలం. అనుకోని శుభాలున్నాయి. పెట్టుబడులు లాభిస్తాయి. లక్ష్మీ ధ్యానం లక్ష్యప్రదం.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

నిత్య కృత్యాలు సౌఖ్యం. శ్రమాధిక్యతకు పెద్ద పీట వేస్తేనే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలు కలసి వస్తాయి. ఆస్తి విషయాలు ఆచితూచి వ్యవహరించండి. అనుకోని విస్తరణ. మంచి వార్తలు శుభాలకు శక్తినిస్తాయి. పట్టుదల అన్నింటా ఉండాలి. అనుకోని శుభాలు. ప్రయాణాల్లో జాగ్రత్త. నైపుణ్యం ఉపయోగపడుతుంది. సన్నిహితులు సమయానికి సలహాలిస్తారు. మీనాక్షి స్తుతి మంచి శక్తినిస్తుంది.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

అన్నింటా అనుకూలతలు. ఆర్థిక తృప్తి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో శ్రమ తగ్గుతుంది. విద్యార్థులకు మంచి సమయం. అనుకోని రంగాలలో మీ కుటుంబ సభ్యులు ప్రవేశించవలసి వస్తుంది. హుషారు తనాన్ని అలవరచుకోవాలి. కోపాలు ప్రదర్శించవద్దు. పెట్టుబడులు లాభిస్తాయి. అధికారులు ఎదురుపడతారు. సహనం మేలు. ఇష్టదేవతా స్మరణం ఫలప్రదం.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

జయాలు, పట్టుదల, నేర్పుతోనే ఉంటాయని గమనిస్తారు. సమయానుకూలంగా పనులు ప్రారంభించి, శుభాలను అందుకోవాలి. కొన్ని విజయాలు ఆసక్తిని పెంచుతాయి. ఆదాయ, వ్యయాలు ఫరవాలేదనిపిస్తుంది. అనుకోకుండా మీ సాయం పొందినవారితో వ్యవహారాదులు ఫలిస్తాయి. అన్నింటా స్వల్ఫ జాగ్రత్తలు సత్ఫలితాలను అందిస్తాయి. భగవతీ ధ్యానం ఫలదాయకం.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

చేసే పనులందు ధ్యాస పెట్టాలి. ఆర్థిక, వ్యవహారాలు ఇతరులను ఆలోచింప చేస్తుంది. దంపతుల అనురాగాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. సన్నిహితులు ప్రయోజనకరమైన సాహయాలు అందిస్తారు. పెట్టుబడుల పథకాలు ఉపయోగపడతాయి. స్త్రీలు శ్రమపై అనుకున్నవి అందుకుంటారు. తొందరలు వద్దు. దేవీ స్మరణం దివ్యప్రదం.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆరోగ్యం జాగ్రత్త. లౌక్యంతో ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎదురు చూస్తున్న వారు వస్తారు. మీకు సాయపడతారు. కొన్ని మంచి మార్పులు ఊహించినట్లే ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహారాల్లో స్వల్ఫంగా అనుకూలం. ధనం ఇంధనంగా ఖర్చుకు అవకాశాలు. ఏకాగ్రత మేలు. ఒత్తిడికి దూరం. రాబడి తృప్తినిస్తుంది. తొందర వద్దు. శుభపరిణామాలు ముందున్నాయి. ఈశ్వరార్చన ప్రాప్తితో తృప్తి.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

అన్నింటా మిశ్రమ ఫలితాలు గోచరించనున్నాయి. ప్రణాళికలు మీకు మేలు. ఎంచుకున్న రంగాలు ముందుకు మెల్లగా వెళ్లేట్లున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు. మీ సలహాలు హితులకు ఉపకరిస్తాయి. మంచి కార్యాలు ముందుకెళతాయి. కుటుంబ వ్యవహారాలు, పెట్టుబడులు రాబడికి అనుకూలం. ఉద్యోగ యత్నాలు నెమ్మదిస్తాయి. ఇష్టదేవతా స్మరణం సంతోషప్రదం.

 మీనం

పూర్వాభాద్ర 4 పా, ఉత్తరాభాద్ర, రేవతి

గతవారం కంటే ఈ వారం చాలా బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలు శ్రమాధిక్యతను కలిగిస్తాయి. మీరు ఎంచుకున్న రంగాలు నెమ్మదిస్తాయి. జయాలు, లాభాలు ఉంటాయి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. పథక రచనలో మీ సాయం యోగిస్తుంది. ప్రయత్న లోపాలు ఉండకుండా చూసుకోవాలి. శుభకార్యాలు ముందుకెళతాయి. భగవతీ స్మరణం మేలు.

– ఎ.సి.ఎం.వత్సల్, 9391137855

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *