శ్రావణ మాసం – 2018 ఆగస్టు 12 – సెప్టెంబర్‌ 09

భారతదేశం, తెలుగు రాష్ట్రాల్లో జరుగు విశేషాలు – సూచనలు :

  • వాతావరణంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వర్ష ప్రభావం వల్ల నష్టాలకు అవకాశం. నదీ పరివాహక వాసులు అప్రమత్తంగా ఉండాలి.
  • రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు ఉండనున్నాయి. ప్రముఖులు స్వర్గస్తులయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయి. కొత్త రాష్ట్రాల్లో విభజనలు జరగడానికి ప్రాతిపదికలు, నూతన సమీకరణలు ఉన్నాయి.
  • రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉండనున్నాయి. ముఖ్యమంత్రులు ఆరోగ్యకరమైన వాతావరణంలోనే అన్నింటా ముందుకెళ్లాలి. జల వివాదాలున్నాయి. తొందరపాటు పనికిరాదు. ఆలోచన, నైపుణ్య సహిత విధానాలు మేలు. శుభకార్యాల్లో అశుభాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఉద్యోగులు సంయమనం పాటించాలి.
  • స్టాక్‌ మార్కెట్‌లో పెనుమార్పులు.
  • వాహన ప్రమాదాలు అధికం. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వ విధానాలు ముందుకెళతాయి. ఆర్థిక అంచనాలు మారతాయి. ఆధ్యాత్మిక భావనతో ముందుకెళ్లాలి. ఈ మాసం అన్నింటా ఆచి తూచి వ్యవహరించాలి.

 మేషం

 అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం

ఆర్థిక తృప్తి ఉంది. కొన్ని కట్టుబాట్లకు లోబడి పనులు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల వల్ల శ్రమాధిక్యతలు పెరగనున్నాయి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దైవ సంబంధ కార్యాలు నిర్వహిస్తారు. ఎంచుకున్న రంగాలు సంతోషకరం. సంతాన సౌఖ్యం. పరిమిత పెట్టుబడులతో లాభాలు. సుబ్రహ్మణ్య స్మరణం శుభకరం.

 వృషభం

 కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు

కొత్త ఆలోచనలు ఉపకరిస్తాయి. అన్ని విషయాల్లో ఆలోచించి ముందుకెళ్ళండి. ప్రయత్నలోపం ఉండరాదు. రియల్‌ ఎస్టేట్‌, భూ లావాదేవీలు బాగుంటాయి. ఋణ యత్నాలు సఫలం. విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యవహార, సాంకేతిక రంగాలు క్రమంగా వృద్ధి. శ్రావణ లక్ష్మీ ధ్యానం ఆనందదాయకం.

 మిథునం

మృగశిర 3,4 పా, ఆర్ద్ర,పునర్వసు

శ్రమానుకూల ఫలితాలున్నాయి. ఎంచుకున్న రంగాల్లో ఒత్తిడులున్నా మేలు జరుగుతుంది.పెట్టుబడుల్లో మిశ్రమ ఫలితాలు. ఎదరు చూస్తున్న విషయాలు పూర్తి అవుతాయి. సహకారాలు అందుతాయి. అంచనాలకు అనుగుణంగా పైకం సమయానికి అందుతుంది. దూరపు బంధువులకు సాయపడతారు. లక్ష్యసాధనలకై శ్రీ భగవతీ ధ్యానం మేలు.

 కర్కాటకం

పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష

గతం కంటే బాగుంటుంది. అనుకూల పరిస్థితుల్లోనే అన్ని పనులు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చిన తీరులో ముందుకెళ్ళండి. మీ విషయాల్లో ఇతరుల జోక్యం వద్దు. అదనపు పని భారం ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఇతరులకు మీ సహకారం అవసరమవుతుంది. చంద్రశేఖర స్తవం శుభకరం.

 సింహం

స్వీయవృత్తుల వారు మెళకువలు పాటించాలి. అకాల భోజనాలతో ఆరోగ్య సమస్యలు. మానసిక చికాకులు లేకుండా వ్యవహరించాలి. ఋణ చెల్లింపుల విషయంలో జాగ్రత్త మేలు. సత్వర నిర్ణయాలు ఒత్తిడులకు గురిచేస్తాయి. పెట్టుబడులు రాబడులను సూచిస్తున్నాయి. అన్ని రంగాల వారు మంగళవారం తప్ప మిగతా రోజుల్లో కొత్త పనులు ప్రారంభించవచ్చు. శ్రావణలక్ష్మీ ధ్యానం లక్ష్యసాధనం. పూలతో పూజ చేస్తే మేలు కలుగుతుంది.

 కన్య

ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు

వృత్తిపరంగా మంచి ఫలాలు అందుకుంటారు. ఆర్థిక లాభాలున్నాయి. గృహ, సంతాన విషయాలు మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని ముఖ్య పనుల్లో అధికారులు సాయం చేస్తారు. మీ మంచితనాన్ని ఇతరులు గుర్తిస్తారు. ఆర్థిక పుష్టి ఉంది. వరలక్ష్మీ స్మరణం లక్ష్యప్రదం.

 తుల

చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

నూతన పనులకు, పథకాలకు మంచి సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాల్లో శ్రమానుకూల ప్రతిఫలాలు అందుకుంటారు. కొన్ని కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్త్రీలు అనుకున్నవి అందుకుంటారు. ఈ వారం చాలా సందడిగా ఉంటుంది. శుభకార్యాలు పూర్తవుతాయి. సౌభాగ్యలక్ష్మీి స్మరణం అనుసరణీయం.

 వృశ్చికం

విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ

అనుకున్నవి ఐచ్ఛికంగా పూర్తి చేస్తారు. ఒత్తిడులు వద్దు. మీరు చేపట్టే పనుల్లో అనుకూలతలున్నాయి. కొన్ని పనులు పూర్తి సంతృప్తినిస్తాయి. స్నేహితులతో ప్రయోజనాలు అందుకుంటారు. బంధుమిత్రుల కలయికతో శుభాలు పంచుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. శుభలక్ష్మీ ఆశీస్సులకై పార్వతీ దేవి ధ్యానం మంచిది.

 ధనస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా

 శ్రమ అధికమైనా ఫలాలు ఆనందాన్నిస్తాయి. ఎదుగుదల అన్నింటా ఉంది. వస్తు, వస్త్ర ప్రాప్తి. ఇతరులపై గుడ్డి నమ్మకం వద్దు. పెద్దలతో సంయమనం పాటించాలి. అన్నింటా మధ్యమ లాభాలు విస్తరిస్తాయి. శ్రీలక్ష్మీ ధ్యానంతో అష్ట ఐశ్వర్యాలకు శ్రీకారం.

 మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. మనసుకు నచ్చినట్టుగా వ్యవహరించండి. ఆర్థిక ప్రయోజనా లున్నాయి. వివాహ శుభకార్యాల్లో పాల్గొంటారు. విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. మాట పట్టింపులు వద్దు. శుభాలు విస్తరిస్తాయి. అన్నింటా మెలకువ మేలు. పార్వతీపరమేశ్వర స్మరణం ప్రగతి పథం.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

సాంఘిక, ఆర్థిక, కుటుంబ విషయాలు అనుకూలం. ఒత్తిడులున్నా లౌక్యంతో ముందుకెళతారు. పెట్టుబడులు మిశ్రమం. ఎంచుకున్న రంగాల్లో నూతన అవకాశాలు. గత బకాయిలు వసూలు. వస్తు, వస్త్ర ప్రాప్తి. అంచనాలు తారుమారవుతాయి. శివాభిషేకం శుభకరం.

 మీనం

పూర్వాభాద్ర 4 పా, ఉత్తరాభాద్ర, రేవతి

అన్నింటా అనుకూల వాతావరణముంది. కొన్ని చిక్కులు మీ ఆలోచనలకు అడ్డుకట్టలు వేయకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక శక్తి మీకు తోడవుతుంది. లక్ష్యాలు అనుకూలిస్తాయి. ధన ప్రాప్తి. ఇష్టదేవతా స్మరణం సౌఖ్యప్రదం.

– ఎ.సి.ఎం.వత్సల్, 9391137855

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *