వాముతో ఎన్నో ప్రయోజనాలు !

వాముతో ఎన్నో ప్రయోజనాలు !

ఇది మన వంటింట్లో ఉండే ప్రధాన దినుసుల్లో ఒకటి. దీన్ని సాధారణంగా చక్రాలలో (జంతికలు, మురుకులు) వాడుతుంటారు. అజీర్తిని నివారిస్తుంది. వాము చూడటానికి జీలకర్రలా కనిపించినా దాని కంటే పరిమాణంలో కాస్త చిన్నగా ఉంటుంది. దీని రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. అయితే వాముతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం!

వాంతులు: వామును కాసిన్ని మంచి నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగితే వాంతులు తగ్గుతాయి.

జ్వరం: వాము, ధనియాలు, జీలకర్ర – ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.

అజీర్ణం: వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.

దంత వ్యాధులు: వామును త్రిఫలాలు- కరక్కాయ, ఉసిరికాయ, తానికాయలతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.

వాత వ్యాధులు: వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.

గొంతులో బాధ: వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.

మూత్రాశయంలో రాళ్లు: వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. వాము, వెనిగార్‌ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.

చనుబాలు వద్ధి: ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వద్ధి అవుతాయి.

జలుబు, తలనొప్పి: జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది.

ఆస్తమా: ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది.

గుండె వ్యాధులు: గుండె వ్యాధులు రాకుండా నివారించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

కీళ్ల నొప్పులు: దీనికి కీళ్ల నొప్పుల్ని తగ్గించే గుణం కూడా ఉంది.

కాలిన గాయాలకు: కాలిన గాయాలకు వాము మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది.

దగ్గు: జలుబు వల్ల దగ్గు ఎక్కువగా ఉన్నపుడు కొద్దిగా వాము తీసుకుని నోట్లో వేసుకొని నమలాలి. తమలపాకులో కాసింత వాముని వేసుకొని నమిలితే రాత్రి పూట పొడిదగ్గు రాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *