లాలాజలం.. దివ్యౌషధం

లాలాజలం.. దివ్యౌషధం

భగవంతుడు మనిషికి, ఇతర జీవులకు ఇచ్చిన వరాల్లో లాలాజలం ఒకటి. మన నోటిలో ఊరే ద్రవ పదార్ధాన్నే లాలాజలం అంటారు. జీవిలో ఈ లాలాజలం ఊరే వ్యవస్థ లేకపోతే నోరు కొబ్బరి తీసేసిన ఎండు చిప్పలా, జీవం లేకుండా తయారయ్యేది. నోటిలో లాలాజలం ఊరటం వల్లనే మన నోరు ఎటువంటి గాయాలు లేకుండా, ఎండిపోకుండా జీవకళతో ఉంటున్నది. నోటిలో ఉండే నాలుక, పళ్లు, చిగుళ్లు, రుచిని తెలిపే వ్యవస్థ అంతా మనం జీవించినన్నాళ్లు జీవంతో ఉంటున్నది. నోరు జీవంతో ఉన్నందువల్లనే మనం మన శరీరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారాన్ని అందించగలు గుతున్నాం.

ఆరోగ్యం దృష్ట్యా చూస్తే మన నోటిలో తయారయ్యే లాలాజలం వలన ఎన్నో ఉపయోగాలున్నాయి. లాలాజలం ద్రవ పదార్థమే అయిన ప్పటికి మందంగా, జిడ్డుగా ఉండటమే అందుకు కారణం.

ఇక ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్ర పోయే వరకు రకరకాల సందర్భాలలో లాలాజలాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం.

ఉదయం నిద్ర లేచిన వెంటనే పక్కమీదే కూర్చుని నీటిని తాగమని ఎందరో వైద్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే రాత్రి నిద్రించినప్పటి నుండి నోటిలో లాలాజలం ఊరుతూ అక్కడే నిల్వ ఉండిపోతుంది. అలా రాత్రి నుండి నోటిలో నిల్వ ఉన్న లాలాజలం ఎంతో ఔషధకారి. ఈ ఔషధకారి అయిన లాలాజలం మన శరీరం లోపలికి వెళ్లవలసిన అవసరం బాగా ఉంది. ఎందుకంటే మలవిసర్జన సాఫీగా జరగడానికి, ఆ తరువాత జీర్ణవ్యవస్థలో అగ్ని (జఠరాగ్ని) పుట్టడానికి ఇది తోడ్పడుతుంది. మలవిసర్జన పూర్తిగా జరిగితేనే జఠరాగ్ని పుడుతుంది. జఠరాగ్ని పుడితేనే తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. అందుకే ఉదయం నిద్ర లేచిన వెంటనే మన నోటిలోని లాలాజలాన్ని పుక్కిలించి బయటికి ఉమ్మకుండా నీరు తాగడం ద్వారా మన శరీరం లోపలికే పంపాలి. అందువలన జీర్ణవ్యవస్థ ఎప్పటికప్పుడు శుభ్రమయి, చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా లాలాజలంతో కలిపి గుటక గుటకగా నీరు తాగాలి. అయితే మనం నిద్రలేవడం ఉదయం 4 నుండి 6 గంటల లోపే జరగాలి. ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లాలాజలంతో తాగే నీరు శరీరానికి శ్రేష్ఠం.

ఒక్క ఉదయం సమయంలోనే కాదు, లాలాజలాన్ని ఎప్పుడూ బయటికి ఉమ్మకూడదు. అనారోగ్య సమయంలో తప్ప ఆరోగ్యంగా ఉన్న ఏ మనిషీ లాలాజలాన్ని బయటికి ఉమ్మాల్సిన అవసరం లేదు. కొంతమంది తాంబూలం వేసుకుని అదేపనిగా బయటికి ఉమ్మి పరిసరాలను పాడుచేస్తూ, తమ ఆరోగ్యమే కాక ఇతరుల ఆరోగ్యం కూడా పాడవటానికి కారణం అవుతారు. కాని తాంబూ లంలో కాచు అనే పదార్ధం వెయ్యకుండా ఉంటే లాలాజలం కలిసిన తాంబూల రసాన్ని లోపలికి మింగవచ్చు. తాంబూలంలో ఉన్న తమలపాకు, సున్నం రెండూ శరీర ఆరోగ్యానికి ఉపయోగపడేవే.

ఇక బ్రహ్మముహూర్త సమయంలో మన నోటిలో ఊరిన లాలాజలంతో మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. మధుమేహం ఉన్నవారికి శరీరంపై ఏదైనా పుండు పడితే అది త్వరగా తగ్గదు. అటువంటి వారు బ్రాహ్మీ ముహూర్తంలో తమ లాలాజలాన్ని చేతిలోకి తీసుకుని దానిని ఆ పుండుపై ఆరగా ఆరగా కొంతసేపు రాయాలి. ఇలా 15 నుండి 20 రోజులపాటు చేస్తే ఆ పుండు తప్పకుండా తగ్గుతుంది. ఇది పరిశోధనలో రుజువైన విషయం. ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కూడా కంటిచూపు ఇబ్బందయి కళ్లజోళ్లు వస్తున్నాయి. అటువంటి వారు బ్రాహ్మీముహూర్తంలో తమ లాలాజలాన్ని కంటిలో ఒక వేలితో కాటుకలా రాసుకోవాలి. లేదా పెద్దలైనా రాయవచ్చు. అలా చేస్తే కొద్దిరోజుల్లోనే కళ్లద్దాలు పెట్టుకోవలసిన అవసరం తగ్గిపోతుంది. ఇది కూడా పరిశోధనలో తేలిన అంశమే. పిల్లలకే కాదు, పెద్దవారి విషయంలోనూ ఈ ఔషధం పనిచేస్తుంది. కాకపోతే పెద్దలకు సమస్య తీరటానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. పిల్లల విషయంలో ఫలితం త్వరగా కనబడుతుంది. కంటి చుట్టూ నల్లని చారలు ఉన్నవారు ఉదయం పూట కంటి చుట్టూ లాలాజలం రాసుకుంటే చారలు త్వరలోనే తగ్గిపోతాయి. కంటికి సంబంధించిన ఏ సమస్య అయినా ఈ ప్రయోగం చేసి నివారణ పొందవచ్చు అని ప్రముఖ ఆరోగ్య కార్యకర్త రాజీవ్‌ దీక్షిత్‌ చెబుతున్నారు. ఈయన ఆరోగ్యం విషయంలో అనేక పరిశోధనలు చేశారు.

అలాగే మన శరీరంపై కాలిన గాయం ఏర్పడితే అక్కడ బ్రాహ్మీముహూర్తంలో లాలాజలం రాయండి. ఇలా కొద్దిరోజులు చేస్తే గాయంతో పాటు మచ్చకూడా తగ్గిపోతుంది. మచ్చ తగ్గేవరకు లాలాజలం రాస్తూనే ఉండాలి. శరీరంపై వచ్చే ఇతర తెల్ల, నల్ల మచ్చలు, తీవ్రమైన చర్మరోగాల విషయంలో కూడా ఈ ప్రయోగం చేసి తగ్గించుకోవచ్చు. కాకపోతే ఎక్కువ సమయం పడుతుంది అని రాజీవ్‌ అంటారు.

ఇక మిగతా సమయాల్లో ఎప్పుడు నీరు తాగినా, భోజనం లేక ఇతర పదార్థాలు తిన్నా లాలాజలంతో సహా తీసుకోవాలి. నీరు తాగేటప్పుడు గుటక గుటకగా లాలాజలంతో కలిపి చప్పరిస్తూ తాగాలి. అంటే నోటిలోకి అత్యంత పలుచగా వెళ్లిన నీరు గొంతులోకి దిగేటప్పుడు లాలాజలంతో కలిసి మందంగా మారి వెళ్లాలి. అలాగే భోజనం లేక ఇతర ఘనపదార్థాలు తినేటప్పుడు నోటితో బాగా నమలాలి. బాగా నమిలే సమయంలో నోటిలోని లాలాజలం మరింత ఊరి తినే పదార్ధంతో కలుస్తుంది. అప్పుడు తినే పదార్థం పలుచగా అంటే దాదాపు నీరుగా మారి లోపలికి వెళుతుంది. ఇలా పలుచగా మారి లోపలికి వెళ్లిన ఆహారం శుభ్రంగా జీర్ణమవుతుంది. శుభ్రంగా జీర్ణమవడం వందశాతం ఆరోగ్యానికి సూచిక. అందుకే ఆరోగ్య పండితులు ‘నీరు తినండి, భోజనం తాగండి’ అని చెబుతుంటారు. అంటే ద్రవంగా ఉన్న నీరు ఘనంగా మారి మన శరీరంలోకి వెళ్లాలి. అలాగే ఘనంగా ఉన్న ఆహారం ద్రవంగా మారి లోపలికి వెళ్లాలి. ఇక రోజు మొత్తంలో ఏం తిన్నా, తాగినా ఈ విధంగానే చేయాలి. అప్పుడు మనిషి అజీర్తి సమస్యలు లే ఆరోగ్యంగా జీవిస్తాడు.

అయితే గమనించవలసిన అంశం ఏమిటంటే బ్రాహ్మీ ముహూర్తంలో మన నోటిలోని లాలాజలం కలుషితం కానిదిగా, ఔషధంగా ఉండాలంటే అంతకుముందు రాత్రి ఎటువంటి చెడు లేదా మత్తు పదార్థాలు తీసుకోరాదు. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. అటువంటి వారికే బాహ్మ్రీ ముహూర్తంలో లాలాజలం ఔషధకారిగా ఉంటుంది.

(రాజీదీక్షిత్‌ ఆరోగ్య రహస్యాలు గ్రంథం ఆధారంగా.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *