మలబద్దకం పోయేదెలా..?

మలబద్దకం పోయేదెలా..?

నేటి సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్దకం. దీనికి ప్రధాన కారణం మారిన జీవన విధానం, సమయానికి ఆహరం, నీరు తీసుకోకపోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం. చిరాకు, కోపం వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్దకం నేడు ప్రధాన సమస్యగా తీవ్రరూపం దాల్చుతుంది.

దీన్ని తేలికగా తీసుకుంటే చాలా రకాల వ్యాధులకు ఇది మూల కారణమ వుతుంది. మలబద్దకం జీర్ణాశయ వ్యాధులు, హైపర్‌టెన్షన్‌, ఫైల్స్‌, ఫిషర్స్‌, తలనొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది.

కారణాలు

– అహార అలవాట్లు సరిగా లేకపోవడం.

– కొన్ని రకాల మందుల వలన, ముఖ్యంగా ఐరన్‌ టాబ్లెట్స్‌ అతిగా వాడటం.

– తరచూ తీవ్రమైన ఆందోళనలకు, ఒత్తిళ్లకు గురి కావడం.

– వేళకు మల విసర్జనకు వేళ్లే అలవాటు లేకపోవటం.

– నీరు తక్కువగా తాగడం.

లక్షణాలు

– తేన్పులు ఎక్కువగా రావటం.

– మలవిసర్జనకు వెళ్లాలంటేనే భయంగా ఉండటం.

– గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం.

– కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు రావడం.

– మల విసర్జన పూర్తిగా కాకపోవడం.

– తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు కావడం.

– మానసిక ఒత్తిడి.

జాగ్రత్తలు

– పీచు పదార్థాలు అధికంగా ఉండే అరటి, పైన్‌ఆపిల్‌, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

– కూరగాయలు, ఆకుకూరలు నిత్యం తీసుకోవడం వలన మలవిసర్జన త్వరగా సాఫీగా జరుగు తుంది.

– ఫాస్ట్‌ఫుడ్స్‌, ఆయిల్‌ఫుడ్స్‌, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి.

– ఆల్కహాల జోలికి పోవొద్దు.

– నిల్వ ఉంచిన పచ్చళ్లు తినొద్దు.

– వేళకు ఆహారం తీసుకోవాలి.

– టీ,కాఫీలు మానివేయాలి.

– కనీసం రోజుకు 5 నుంచి 10 లీటర్ల నీరు తాగాలి.

– మానసిక ఒత్తిడిని నివారించడానికి యోగ, వ్యాయమం చేయాలి.

చికిత్స-మందులు

హోమియో వైద్యంలో ‘మలబద్దకం’తో బాధపడే వారికి మంచి చికిత్స ఉంది. శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా మందులను ఎంపిక చేసుకొని ఇవ్వడం వల్ల వ్యాధి సమూలంగా నివారణ అవుతుంది.

నక్స్‌వామికా

మసాలాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌, కాఫీలు ఎక్కువగా సేవిం చడం, శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక శ్రమ ఎక్కువగా ఉన్నవారికి ఈ మందు ఆలోచించ దగినది. మానసిక స్థాయిలో వీరికి కోపం ఎక్కువ. శబ్దాలు, వెలుతురు భరించలేరు. ఇటువంటి లక్షణాలు ఉండి మలబద్దకంతో బాధపడుతున్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.

బ్రయోనియా

వీరికి దాహం ఎక్కువగా ఉంటుంది. అయి నప్పటికీ మలబద్దకంతో బాధ పడుతుంటారు. మలం గట్టిగా వస్తుంది. మానసిక స్థాయిలో వీరు ఇంటిపైనే ఎక్కువగా బెంగపెట్టుకొని ఉంటారు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడుకోదగినది.

ఓపియం

వీరికి మలవిసర్జన సరిగా కాదు. ఒకవేళ అయినా గట్టిగా నల్లని ఉండల వలే వస్తుంది. మలబద్దకంతో బాధపడే ముసలి వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

అల్యూమినా

మలం మెత్తగా వస్తుంది. ఒత్తిడితో కూడిన మలవిసర్జన అవుతుంది. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలలో మలబద్దక సమస్య నివారణకు ఈ మందు వాడుకోదగినది. అలాగే డబ్బా పాలు తాగే పిల్లల్లో ఏర్పడే మలబద్దకం నివారణకు ఈ మందు బాగా పనిచేస్తుంది.

కాస్టికం

పక్షవాతం వలన మలవిసర్జన సరిగా జరగని వారికి ఈ మందు ప్రయోజనకారి.

ఈ మందులే కాకుండా గ్రాఫైటీస్‌, సల్పర్‌, సైలీషియా, ప్లంబం వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్‌ సలహ మేరకు వాడితే మంచి ఫలితం ఉంటుంది.

– డా|| పావుశెట్టి శ్రీధర్‌,  హోమియో ఫిజీషియన్‌, 94402 29646

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *