హోమియో వైద్యంతో కళ్ళను కాపాడుకుందాం

హోమియో వైద్యంతో కళ్ళను కాపాడుకుందాం

‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు. జ్ఞానేంద్రియాల్లో కన్ను ప్రధానమైనది. మనం నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే దాకా కళ్లు ప్రతి పనిలో మనకు సాయపడతాయి. కావున మనం ఎల్లప్పుడూ కళ్లను సంరక్షించుకోవాలి.

కంటి సమస్యలకు కారణాలు, లక్షణాలు :

1. దూరపు ప్రయాణాలు చేస్తున్న సమయంలో రోడ్లపైనున్న దుమ్ము, ధూళి తరచూ కళ్లలో పడుతుంది. అందువల్ల కళ్లు ఎర్రపడటం, రెప్పలు అంటుకుపోవడం, కళ్ల నుండి నీరుకారడం, కళ్లలో ఇసుక పడినట్లుగా అనిపించడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి.

2. కొన్ని కాలాల్లో కంటికి వచ్చే ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల కంటి రెప్పలపై గాని, కంటి లోపలగాని కురుపులు ఏర్పడతాయి.

3. కంప్యూటర్లు, టివిలు చాలా సేపు చూస్తూ కంటికి ఎక్కువ శ్రమ ఇవ్వడం వల్ల, ద్విచక్ర వాహనాలపై కళ్లజోడు లేకుండా ప్రయాణాలు చేయడం వల్ల కంట్లో నీరు ఎండిపోయి కంటి సమస్యలు వస్తాయి.

జాగ్రత్తలు :

1. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కళ్లలో దుమ్ము, ధూళి పడకుండా కళ్లజోడు ధరించాలి.

2. కంటి నుంచి నీరు కారుతున్నప్పుడు కంటిని ఎక్కువగా నలుపకూడదు. చేతిరుమాలుతో అద్దాలి.

3. కంటికి సరిపడా నిద్రపోవాలి.

4. ఎక్కువ సేపు టివి, కంప్యూటర్‌ చూడటం తగ్గించాలి.

5. ఎక్కువ సేపు కంప్యూటర్‌ పనిలో నిమగ్నమయ్యే వారు తప్పని సరిగా యాంటి రిఫ్లెక్టింగ్‌ కోటింగ్‌ గ్లాసెస్‌ వాడాలి.

6. ఎండలో బయటికి వెళ్లి వచ్చిన తరువాత వెంటనే కళ్లను నీటితో శుభ్రం చేసుకోవాలి.

7. ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు తప్పకుండా కళ్లజోడు ధరించాలి.

8. కూలర్లు, ఏసిలకి దగ్గరగా కూర్చోకూడదు.

9. ఫ్యాన్‌ గాలి నేరుగా కళ్ళపై పడే విధంగా ఉండకూడదు.

10. ఎండాకాలంలో బయటకు వెళ్లాల్సి వస్తే ఫోటో గ్రేసన్‌ గ్లాసెస్‌ వాడాలి. ఇవి వాడటం వల్ల సూర్యకిరణాలు నేరుగా కంటిపై పడవు.

చికిత్స:

కంటి సమస్యలకు ¬మియో వైద్యంలో మంచి మందులున్నాయి. వీటిని వైద్యుల సలహా మేరకు వాడితే కచ్ఛితంగా ఉపయోగం ఉంటుంది.

మందులు :

బెల్లడోనా : వేసవిలో వచ్చే కంటి వ్యాధులకు ఈ మందు బాగా పని చేస్తుంది. కళ్లు ఎర్రబడటం, కళ్లవాపు, వెలుతురును చూడలేక పోవటం, శరీరం వేడిగా ఉండటం వంటి లక్షణాలున్నప్పుడు ఈ మందు వాడితే ఫలితం ఉంటుంది.

అర్జెంటంనైట్రికం : కనురెప్పలపై చీము పొక్కు లుండి, నీరు కారడం, కనురెప్పలు ఉబ్బటం, బరువుగా అనిపించటం, దట్టంగా పుసులు ఉండి వెలుతురును చూడలేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ మందు వాడొచ్చు.

రూటా : కుట్టుపని, కంప్యూటర్‌ ఎక్కువగా వాడే వారు ఎదుర్కొనే కంటి సమస్యలకు ఈ మందు ఆలోచించదగినది.

యూఫ్రేషియా: కనురెప్పల వాపు, కళ్లు ఎర్రబడటం, పుండ్లు ఏర్పడటం, కళ్ళ మంటలతో పాటు ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలున్నప్పుడు ‘యూఫ్రేషియా’ కంటి చుక్కల మందు వాడి కంటి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఈ మందులే కాకుండా స్టాఫీసాగ్రియా, పల్సటిల్లా, ఫ్రెరంఫాస్‌, తూజ, కాలీసల్ఫ్‌, నేట్రం మూర్‌ , రూస్టాక్స్‌ , మెర్క్‌సాల్‌, నైట్రిక్‌ ఆసిడ్‌ వంటి మందులను డాక్టర్‌ సలహా మేరకు వాడితే కంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

– డా|| పావుశెట్టి శ్రీధర్‌, 94402 29646

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *