చలికాలంలో బెల్లం తింటే మంచిది !

చలికాలంలో బెల్లం తింటే మంచిది !

పాలు, బెల్లం రెండూ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవే. వీటి వల్ల మనకు కలిగే పలు అనారోగ్యాలు నయం అవడమే కాదు, మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు కూడా అందుతాయి. ముఖ్యంగా బెల్లాన్ని మాత్రం చలికాలంలో ఎక్కువగా తినాలి. బెల్లాన్ని పాలలో కలుపుకుని తాగితే మరీ మంచిదని అధ్యాయనాలు నిరూపిస్తున్నాయి.

పాలు, బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు

వేడి, వేడి పాలలో కాస్త బెల్లం కలుపుకుని ప్రతిరోజు తాగితే బరువు అధికంగా ఉన్నవారు తగ్గుతారు. బెల్లం, పాలలో ఉండే పలు రకాల ఔషధ గుణాలు శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గిస్తాయి. తద్వారా బరువు తగ్గుతారు. ఇలా నిత్యం తాగడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది.

ప్రస్తుత కాలంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్య రక్తహీనత. దీని వల్ల శరీరంలో రక్తం కావలసినంత ఉండదు. ఫలితంగా ఆరోగ్యం చెడిపోతుంది. పోషకాలు అందవు. అయితే బెల్లం కలిపిన పాలు ప్రతిరోజు తీసుకుంటే రక్త హీనత సమస్య ఇట్టే తొలగిపోతుంది. రక్తం బాగా పుడుతుంది. ప్రధానంగా మహిళలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

బెల్లం కలిపిన పాలను తాగడం వల్ల వాటిలో ఉండే పోషకాలు జుట్టును కాంతివంతంగా చేస్తాయి. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. చుండ్రు తగ్గిపోతుంది. నెలసరి సమయంలో మహిళలకు వచ్చే వివిధ రకాల సమస్యలు, ప్రధానంగా కడుపునొప్పి సమస్య తగ్గుతుంది.

పాలు, బెల్లంలలో సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్‌, యాంటీ వైరల్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల అవి శరీరంలో అనారోగ్యాలను కలిగించే వైరస్‌, బాక్టీరియాల భరతం పడతాయి. దీంతో చలికాలంలో వచ్చే పలు ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వద్ధాప్యంలో చాలా మందికి కీళ్ల నొప్పి సమస్యలు వస్తుంటాయి. అయితే అలాంటి నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజూ గోరువెచ్చని పాలలో కాస్త బెల్లం కలుపుకుని తాగితే ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, కీళ్లు దృఢంగా తయారవుతాయి. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం వంటి ఇబ్బందులు తొలగిపోతాయి.

బెల్లం, పాలలో అద్భుతమైన పోషకాలు, మినరల్స్‌ ఉంటాయి. కావున ఇవి శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి.

– హర్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *