ఇంగువతో ఆరోగ్యం

ఇంగువతో ఆరోగ్యం

ఇంగువను కూరల్లో ఉపయోగించడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అజీర్తితో బాధపడే వారు ప్రతిరోజు ఇంగువను కూరల్లో వేసుకొని తింటే మంచి ఫలితం లభిస్తుంది. కడుపులో మంట, అన్నం అరగకపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. గ్లాసు నీళ్లలో, లేదంటే మజ్జిగలో చిటికెడు ఇంగువ పొడి వేసుకుని తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఇంగువ రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. స్త్రీలలో ఋతు సమస్యల్ని తగ్గిస్తుంది.

చెంచా తేనెలో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని తింటే గొంతు మంట తగ్గుతుంది. జలుబు, దగ్గు అదుపులోకి వస్తాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. క్యాబేజీ, బంగాళాదుంప వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్‌ చేరి ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య బాధించకుండా ఉండాలంటే ఆ కూరల్లో చిటికెడు ఇంగువ వేస్తే చాలు గ్యాస్‌ సమస్య బాధించదు. రక్తపోటును అదుపులో ఉంచే పోషకాలు ఇంగువలో ఉన్నాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఆస్తమాతో బాధపడే వారు ఇంగువను తీసుకోవడం వల్ల ఆ సమస్య అదుపులో ఉంటుంది. రెండు చెంచాల తేనెను 2, 3 సెంటి గ్రాముల ఇంగువ పొడిని, తెల్ల ఉల్లి రసం, తమలపాకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశవ్యాధులు దూరంగా ఉంటాయి. హిస్టీరియాతో బాధపడే వారికి ఇంగువ వాసన చూపిస్తే ఫలితం ఉంటుంది.

– తన్నీరు శిరీష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *