అలనాటి పరిజ్ఞానం – ఆధునిక అజ్ఞానం

అలనాటి పరిజ్ఞానం – ఆధునిక అజ్ఞానం

భారతదేశ సాహిత్యంలో అత్యధిక భాగం నాలుగు మూల స్థంభాలపై ఆధారపడి విలసిల్లింది. ఆ నాలుగు రామాయణం, మహాభారతం, పురాణాలు, బృహత్‌ కథ. భారతదేశంలోని విభిన్న భాషల రచయితలందరికీ స్ఫూర్తి ఆ రామాయణం, జయకావ్య, మహాభారతం, పురాణాలే. భారతీయ సాహిత్యం గురించి చర్చించా లని అనుకున్నప్పుడు భారతం, రామాయణం, పురాణాల విషయాలు తేలుసుకోవలసిందే. వీటి గురించి క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్నప్పుడే సాహిత్య చర్చకు న్యాయం చేయగలం. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. ఆ నాలుగు స్థంభాలపైనే భారతీయ వాఙ్మయం విలసిల్లింది. ఈ నాలుగు స్థంభాల నిర్మాణంలో ఉపయోగించిన వస్తువేది? వీటన్నింటికి కేంద్ర బిందువేది? ఈ వివరాలు తెలిసినవారు కొంతమందే.

ప్రపంచ వాఙ్మయంలో అతిపురాతనమైనవి మన వేదాలే. ఇది కూడా అందరూ ఆమోదించిన విషయం. వేదాలలో ఉపయోగించిన భాషకు జెండా అవస్థాలో ఉపయోగించిన భాషకు దగ్గరి సంబంధ ముందని భాషా పండితులు తెలుసుకున్నారు. మరోవైపు యవని, లాటిన్‌ భాషలకు దగ్గరి సంబంధముంది. భారతీయులపై పెత్తనం చెలాయించడానికి వలస పాలకులు క్రిష్టియన్‌ మిషనరీలతో కలిసి భాషలను ఆయుధంగా వాడుకున్నారు. ముఖ్యంగా హిందూ సమాజం మీద పెత్తనం చెలాయించడానికి వారికి భాష బాగా ఉపయోగపడింది. ‘మేం కూడా మీ వలెనే ఈ దేశానికి వలస వచ్చిన వాళ్లమే. ఒక రకంగా మనమందరం ఒకే తరగతికి చెందినవారం’ అని భారతీయుల బుర్రలకు ఎక్కేటట్టు విషయాలు క్రోడీకరించారు.

మరోవైపు ముస్లిము లను హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టిన వారు కూడా ఈ వలస పాలకులే. హిందువులు విగ్రహారాధాకులు. మీరు విగ్రహాలను ఆరాధించరు. హిందువులు మీకు వ్యతిరేకంగా నడుచు కుంటున్నారనీ, మీమీ భాషా, సంస్కృతులు వేరు వేరని హిందువులు, ముస్లిముల మధ్య దూరం పెరిగేలా చేయగలిగారు.

మరోవైపు ద్రవిడులు అంటూ ఇంకొక సృష్టి చేశారు. ఆ ద్రవిడులను అక్కున చేర్చుకుంటున్నట్టు భ్రమ కల్పించారు. ఆర్యులు మిమ్మల్ని బానిసలుగా చూసేవారు. మిమ్మల్ని ఉత్తర భారతదేశం నుండి దక్షిణానికి తరిమివేసినవారు కూడా వారే. ద్రవిడ సంస్కృతి అభివృద్ధి చెందినది. మీ సాహిత్యం గొప్పది. ఆర్యుల కంటే మీరే గొప్పవారు. ఆర్యుల బారినుండి మిమ్ములను కాపాడే బాధ్యత మాదే అని వలసపాలకులు ద్రవిడులను రెచ్చగొట్టేవారు.

భారతీయుల నడుమ వలసపాలకులు రాజేసిన మంట దాని లక్ష్యాన్ని నెరవేర్చింది. దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వమే ప్రజలు రకరకాలుగా విడిపోయి ఉన్నారు. అందులో ఆర్య, ద్రావిడ, ముండ, మంగోల్‌, నిషాద్‌లు ఒక రకం. హిందు, ముస్లిం, సిఖ్‌, క్రిష్టియన్‌, బౌద్ధులు, జైనులు, పార్శీలు మరొక రకం. అంతేకాదు, ఉత్తర దక్షిణ, తూర్పు, పడమరలుగా, ప్రాంతీయంగా కూడా విడిపోయారు. ఇలా పలు రీతులతో సమాజం విడిపోయింది. కానీ స్వాతంత్య్రం లభించిన తర్వాత కూడా రాజకీయ నాయకుల ధోరణుల వల్ల ఈ భావాలకు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. వేర్వేరు అనే భావాలు మరింత వేళ్లూనుకున్నాయి. స్వతంత్ర భారతదేశంలో ప్రజల మధ్య విభజన రేఖలు మరింతగా పెరిగాయి. వలస పాలనా కాలానికి మించి ఎన్నో రెట్లు అధికంగా పెరిగిపోయాయి.

భారతజాతిని నిర్వచించడానికి పాశ్చాత్య పండితులు గొప్ప ప్రయత్నం చేశారు. గడచిన 5 నుండి 7వేల సంవత్సరాలకు పూర్వం భారతజాతి విశాలమైన భూభాగంలో నివాసం ఉండేది. ఉత్తరాన వంక్లుతత్‌ నుండి దక్షిణాన సింహళం (నేటి శ్రీలంక) వరకు పడమరు ఆర్యన్‌ (నేటి ఇరాన్‌) నుండి తూర్పున ప్రాగ్జోతిష్య పురం (నేటి అస్సాం) వరకు భారతదేశం ఉండేది.

మహాభారతంలో ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇదే కాకుండా పురాణాలలో, పాణిని ‘అష్టాధ్యాయి’, కాళిదాసు ‘రఘువంశం’, చంద్‌ బర్దాయీ ‘పృథ్వీరాజ్‌ రాసో’, కుంభకర్ణుని ‘జయచంద్‌ రాసో’, ‘రతన్‌ రాసో’… ఇలా పెక్కు గ్రంథాలలో, సాహిత్యంలో ఆధారాలు లభించాయి. మహాభారతంలో ధృతరాష్ట్రుడు గాంధార దేశానికి చెందిన రాకుమారి గాంధారిని వివాహమాడుతాడు. గాంధార దేశం కాందహార్‌ అంటే నేటి ఆప్ఘనిస్తాన్‌. గాంధారి నూర్గురు వీరులకు జన్మనిస్తుంది. గాంధారి సోదరుడు శకుని. శకుని కూడా గాంధార దేశ సమీపంలోని పర్వత రాజ్యాలలో ఉండేవాడు. పాణిని రచనల్లో ఆ పర్వతాలను కక్కుటగిరి అని పేర్కొన్నాడు. ఈ పర్వతాలు ఇరాన్‌లో ఉన్నాయి. ఇరాన్‌ సాహిత్యం ప్రకారం ఇరాన్‌లో ఆదిమ జాతికి చెందిన శక్రుంట్‌ ప్రజలుండేవారని వారి రాజు ‘శకుని’ అని తెలియవస్తుంది. పాణిని వ్యాకరణంలో ఫ్రక్నవ్‌ (Ferghana ), దక్షికాంతా (Tashkent), వామలీక్‌ (Balkh), ద్వాక్షాయన్‌ (Badakhsham), కుభ (Kabul)ల ప్రస్తావన ఉంది.

ఇరాన్‌ సాహిత్యంలో షడ్వాల్‌, నడ్వాల్‌, సుర్మాస్‌, అంతర్యాన్‌ల ప్రస్తావన ఉంది. కాళిదాసు విరచిత రఘువంశంలోని రఘు మహారాజు వంగలను, సుహ్యలను, పాండ్యలను ఓడించడమే కాకుండా పడమరలో ఉన్న పార్శీలను, ఉత్తరాన ఉన్న మక్షుటట్‌లోను కూడా ఓడించాడు. ఆ తరువాత కిరాతులను ఓడించి పర్వత ప్రాంత గణ రాజ్యాలను కూడా ఓడించి ప్రాగ్‌జ్యోతిష పురానికి చేరుకున్నాడు. అతడు ఓడించి ఏడు గణ రాజ్యాలు యక్ష్‌ చిహ్న (నేటి అక్సాయి చిహ్న్‌), కిన్నార్‌ చిహ్న్‌ (నేటి కిన్నేర్‌), సిద్ధ్‌ చిహ్న్‌ (నేటి టిబెట్‌), గంధర్వ చిహ్న్‌ (నేటి నేపాల్‌), విద్యాధర్‌ చిహ్న్‌ (నేటి సిక్కిం), భూటో చిహ్న్‌ (భూటాన్‌) మరియు నాగ్‌ చిహ్న (నాగాలాండ్‌). ప్రతి పేరులో ఆ తెగకు చెందిన వారి గుర్తింపు ఉంది. 12వ శతాబ్దానికి చెందిన జయచందుడు దక్షిణాన సింహళాన్ని (శ్రీలంక) జయించాడు. ఉత్తరంలో 8 మంది రాజులను, ఇరాన్‌-తురాన్‌-బల్క్‌ బదక్షన్‌ రాజ్యాలను జయించాడు.

ఈ రచయితలు రాసిన ఈ విషయాలనే చారిత్రక సత్యాలుగా మీరు ఒప్పుకోవాలని నేరు కోరడం లేదు. కవులు, రచయితలు తమ కాలం నాటి ప్రజల మనోభావాలనే రచనలలో ప్రతిబింబిస్తారు. ఈ దేశం నలుమూలల రాజ్యాలను జయించినవాడినే చక్రవర్తిగా నాటి ప్రజలు ఆమోదించారు. ఈ విషయాన్నే రచయితలు తమ రచనల్లో ప్రతిబింబించారు.

భారతదేశమంతటికి కలిపి ఒకే రాజు లేనప్పుడు దేశంలో ఏదైనా తేడా కనిపించిందా? లేదు. భావోద్వేగాలతో కూడి ఉండేది జాతి. ఈ విషయాన్ని రాజకీయ పండితులు అందరూ ఆమోదిస్తారు. మధ్యయుగంలో భారతదేశం 500 నుండి 700 చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండేది. అయినా చార్‌ధామ్‌ యాత్రలు జరుగుతుండేవి. మేమంతా ఒకే జాతి అనే భావన లేనట్లయితే దక్షిణాన కాలడి నుంచి బయలుదేరిన శంకర భగవత్పాదులు కశ్మీర్‌, కాశీ నగరాలను ఎందుకు సందర్శిస్తాడు. ఆ రోజుల్లో శంకరులు కాలినడకనే దేశమంతటా పర్యటించాడు. శంకరులు 32వ ఏటనే పరమపదించినప్పటికీ అంతకు ముందే దేశం నలు దిశల నాలుగు పీఠాలను స్థాపించారు.

ఏది ఎలా ఉన్నా, విదేశీ నిపుణులు, చరిత్ర కారులు మాత్రం జాతి వేరు రాష్ట్రం వేరు అని భావిస్తారు. విజయకేతనం ఎగిరే రాజ్యం వరకే మన హద్దులంటారు. మీరు అష్వకాయన్‌, గాంధారాన్ని, శకస్థాన్‌, ఆర్యన్‌, ప్రశ్నన్‌, దక్షికాంతలను మరిచి పోమ్మని మనకి నూరి పోస్తూ ఉంటారు. వేదాల భూమిని, అశ్వకాయక్‌ను, పాణిని వ్యాకరణాన్ని, రఘువంశాన్ని, అశోకుని శిలాశాసనాలను, బుద్ధుని విగ్రహాలను (ఇరాక్‌లోనివి) మర్చిపోమ్మంటారు.

ఇంకా తక్షశిలను, చరకుడు, శుశ్రుతులను కూడా మరిచిపోమ్మంటారు. హూణులను అడ్డగించిన రఘు మహారాజును మరిచిపోమ్మంటారు. అసలు భారతదేశం ఒక దేశం కానే కాదు, భారతదేశ సరిహద్దులను మేమే నిశ్చయిస్తాం. ఖైబర్‌ కనుమ భారత్‌లో భాగం ఎలా అవుతుంది! అది భారత్‌కు ప్రవేశ ద్వారం అవుతుంది. ఆ ద్వారం గుండానే ఆర్యులు భారతదేశానికి వచ్చి ఉండవచ్చు. ఆ తరువాత శాక్యులు, శిథియన్లు, హూణులు, ఆఫ్ఘానులు, తుర్కుష్కులు, మంగోలులు, గజని, ఘోరీ, నాదిర్షా, అహ్మద్‌షా వీరందరు భారతదేశ సంపదను దోచుకోవడానికి వచ్చారు. ఆ ప్రవేశ ద్వారం వల్లనే భారతీయులు విదేశీయులకు బానిసలు కావలసి వచ్చింది. ఇప్పుడు ఈ యూరోపియన్‌ ఆర్యన్‌ సోదరులు వచ్చారు. వీరు మీ బానిస సంకెళ్లను తొలగించడానికి రాలేదు.

బ్రిటిష్‌ పాలకులు ఈ విధంగా భారత జాతిని పలు సరిహద్దు రాష్ట్రాలలో విభజించారు. భారతీయులమైన మనం మన భాషలోని కొన్ని పదాలను మర్చిపోయాం. కొన్ని పదాల అర్థాలను సైతం మర్చిపోయాం. సంధి, విభక్తిల మూల భావాన్ని మర్చిపోయాం. దానివల్ల తోటి నాగరికులలో ఎలా మసలు కోవాలో తెలుసుకోలేకపోతున్నాం.

భారత ప్రజలను విడదీయడానికి విదేశీ పాలకులు అన్ని అవకాశాలను ఉపయోగించారు. భాషాపరంగా విడగొట్టడానికి విషబీజాలు నాటారు. ఆ చెట్టు పెరిగి పెద్దదై పూలు, పండ్లను ఇవ్వసాగింది. ఒకవైపు మన దేశానికి ఇండో యూరోపియన్‌లోని 5 దేశాల ప్రజలతో రక్త సంబంధాలున్నాయని తెలిసి ఆనందపడాలా, విభిన్న భాషలు మాట్లాడటం వల్ల మేము వేర్వేరు అన్న భావనలు తలెత్తుతుంటే సిగ్గుపడాలా? ఇదీ నేటి స్థితి.

దేశంలో హిందీ, ఉర్దూ, పంజాబీ, మార్వాడీ, మఘాయి, తమిళం, తెలుగు, ఒరియా… ఎన్నో భాషలు విదేశీ పాలకులు భారతీయులను భాషాపరంగా విడదీయడానికి ఎన్నో కుతంత్రాలకు పాలుపడ్డారు. విజయం సాధించారు.

భారతదేశ ఏకత్వాన్ని మనమెప్పుడు గుర్తిస్తాం? మన వ్యాకరణంలోని ‘సమాసం’ అనే దాని అర్థాన్ని ఎప్పుడు గ్రహిస్తాం. ‘విభక్తి’ నుండి మనకు ఎప్పుడు రక్షణ? అసలు భాష అనేది జాతిని కలిపి ఉంచేది. విదేశీయులు మన నెత్తిన రుద్దిన భాష మనందరిని కలిపి ఉంచగలదని భావిస్తున్నాం. కాని అది మన దేశాన్ని మరిన్ని ముక్కలుగా చేయగలదు. ఆంగ్లాన్ని అధికార భాష చేశారు. సంస్కృత భాషను పక్కన పెట్టారు. నేటి ప్రభుత్వాలు త్రిభాషా సూత్రాన్ని ప్రవేశ పెట్టాయి. ఈ త్రిభాషలో సంస్కృతం లేదు. మన పాలకులు మృతభాషల వెంటపడుతున్నారు. దేశమంతటిని కలిపి ఉంచేది సంస్కృత భాష. సులువుగా నేర్చుకోగలిగిన భాష సంస్కృతం. జనగణన చేసేటప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ‘రోమన్‌’లో సంతకం చేసినప్పుడు అతడిని ఆంగ్లంలో నిష్ణాతుడుగా పరిగణిస్తారు. దానికి మేము ఒప్పుకుంటాం. ఈ లెక్కన మన దేశంలో ఆంగ్లం తెలిసినవారు 2 నుండి 3 శాతం ఉంటారు. ఇదిలా ఉంటే మన దేశంలో ఆంగ్లం నేర్చుకున్న వ్యక్తిని ఇంగ్లాండులో ఆంగ్లం బోధించడానికి ఆ దేశం ఒప్పుకోదు.

మనం మన సంస్కృత వాఙ్మయాన్ని అధ్యయనం చేయాలి. మనం కోల్పోయిన సంస్కృత సాహిత్యాన్ని వెతికి పట్టుకోవాలి. వేదాంగాల గురించి తెలుసు కోవాలి. ఇవి ఆరు. అందులో రెండింటి గురించి తెలుసుకుందాం. ఒకటి నిరుక్త, రెండోది జ్యోతిష్యం. నిరుక్తాన్ని యాస్కుడు వ్రాశాడు. వేదాలు ఇతిహాస రూపంలో చెప్పినవన్ని అభిదా పద్ధతిలో వ్యాఖ్యానం చేయవచ్చు.

వేదాలు పాటలు కాదు, పశువుల కాపరుల సంస్కృతి వర్ణనలు కావు. విదేశీ విద్యావేత్తలు వేదాల గురించి ఏవైనా ఇలాంటి విషయాలు ప్రస్తావించి మన బ్రెయిన్‌వాష్‌ చేయాలనుకున్నప్పుడు వారినుండి తప్పుకోండి.

భారతీయ వాఙ్మయంలో అంతర్లీన ప్రవహిస్తున్న దారాన్ని చూడాలనుకుంటే దివ్య దృష్టి అవసరం. జ్ఞానానికి గురువైన బ్రహ్మ మనందరికీ దివ్యదృష్టి ఇచ్చుగాక.

‘శుభం భవతు సర్వేషాం’

– పండిట్‌ కాశీరాం శర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *